Darshan: ‘రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. ఒంటరిగా ఉండలేకపోతున్నా’.. జైలు అధికారులతో మొరపెట్టుకున్న దర్శన్

జల్సా జీవితానికి అలవాటు పడ్డ హీరో దర్శన్ జైలులో ఉండలేకపోతున్నాడు. ఇప్పటికే అతను పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. కాగా కొన్ని నెలల క్రితమే బెంగళూరు పరప్పన అగ్రహారం జైలు నుంచి బళ్లారి జైలుకు దర్శన్ ను తీసుకొచ్చారు. అయితే ఇక్కడ దర్శన్ పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని సమాచారం. గత కొద్దిరోజులుగా జైల్లో ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు తెలుస్తోంది.

Darshan: 'రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోంది.. ఒంటరిగా ఉండలేకపోతున్నా'.. జైలు అధికారులతో మొరపెట్టుకున్న దర్శన్
Darshan
Follow us
Basha Shek

|

Updated on: Oct 05, 2024 | 5:22 PM

అభిమాని హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ సుమారు 5 నెలలుగా జైలులో మగ్గుతున్నాడు. రేణుకాస్వామి (29) ని పాశవికంగా హత్య చేసిన కేసులో అతనితో పాటు పవిత్ర గౌడ కూడా జైలు జీవితం గడుపుతోంది. రేణుకాస్వామి హత్యకు సంబంధించి దర్శన్‌ ఏ2, నటి, పవిత్రగౌడను ఏ1 అని పోలీసులు పేర్కొన్నారు. కాగా జల్సా జీవితానికి అలవాటు పడ్డ హీరో దర్శన్ జైలులో ఉండలేకపోతున్నాడు. ఇప్పటికే అతను పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. కాగా కొన్ని నెలల క్రితమే బెంగళూరు పరప్పన అగ్రహారం జైలు నుంచి బళ్లారి జైలుకు దర్శన్ ను తీసుకొచ్చారు. అయితే ఇక్కడ దర్శన్ పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని సమాచారం. గత కొద్దిరోజులుగా జైల్లో ఆయన నిద్రలేని రాత్రులు గడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తనను రేణుకాస్వామి ఆత్మ వెంటాడుతోందని జైలు అధికారులతో దర్శన్‌ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. నిద్రపోతున్న సమయంలో రేణుకాస్వామి ఆత్మ కలలోకి వచ్చి బయపెడుతుందని హీరో చెబుతున్నాడట. ఇక్కడ తాను ఒంటరిగా ఉండలేకపోతున్నట్లు, తనను బెంగుళూరు జైలుకు తరలించాలని అధికారులను వేడుకుంటున్నాడట. ఇక అర్ధ రాత్రి సమయంలో నిద్రలోనే దర్శన్ గట్టిగా కేకలు పెడుతున్నట్లు తోటి ఖైదీలు కూడ చెబుతున్నారట. అయితే ఈ విషయం గురించి జైలు అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరో వైపు దర్శన్ తీవ్రమైన వెన్నునొప్పి తో బాధపడుతున్నాడట. ఈ కారణంగానే అను కూర్చోలేక నిలబడలేక పోతున్నాడు. పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు మింగిన తర్వాత కూడా నొప్పి తగ్గడ లేదట. కాగా దర్శన్ వెన్ను నొప్పికి సర్జరీ చేయించుకోవాని, లేకుంటే కష్టమని వైద్యులు చెబుతున్నారు. అయితే బళ్లారిలో శస్త్ర చికిత్సకు దర్శన్ సిద్ధంగా లేడు. బెంగుళూరులో ట్రీట్‌మెంట్ తీసుకుంటానని పట్టుబడుతున్నాడు. కాగా ఈ విషయంలో దర్శన్ వాంగ్మూలాన్ని జైలు అధికారులు రికార్డు చేశారు. దర్శన్ అంగీకరిస్తే విమ్స్ ఆసుపత్రిలో స్కానింగ్ చేసేందుకు సన్నాహాలు చేశారు. కాగా మరో వైపు బెయిల్ కోసం దర్శన్ తరపు న్యాయవాది కోర్టులో వాదిస్తున్నారు. సాక్షులంతా కల్పితమని ఆరోపిస్తున్నారు. తప్పుడు సాక్షులను సృష్టించి దర్శన్‌ను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. దర్శన్ ఆరోగ్య సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దీనిని ఆయన తరపు న్యాయవాది కోర్టు ముందుంచే అవకాశం ఉంది. దీన్ని బట్టి బెయిల్ కోసం డిమాండ్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
కలర్‌ పై ఫన్నీ కామెంట్స్.! ఇచ్చిపడేసిన డైరెక్టర్.. నోరు మూసుకున్న
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
చెక్‌పోస్ట్ దగ్గర ఆగిన బోలోరో కారు చెక్ చేయగా.. లోపల కనిపించింది
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
గోశాల బయట మూడు కోళ్లు మిస్సింగ్.. కంగారుపడి ఏంటా అని చూడగా
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
విశాఖ ఆర్కే బీచ్‌‌లో అద్భుత దృశ్యం.! సముద్రం చూసి ఆందోళన..
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
సాలంగాపూర్ హనుమాన్ ఆలయంలో ఆసక్తికర ఘటన! హెలికాప్టర్‌ను ఆపి అక్కడే
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్‌.! పిఠాపురం ప్రజలు ఫుల్ హ్యాపీ.!
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
జాకీర్‌ హుస్సేన్‌ ‘వాహ్‌ తాజ్‌’ వెనుక కథేంటంటే.? ఒక్క యాడ్‌ తో..
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
టీ కొట్టు మాటున గుట్టుచప్పుడు యవ్వారం.. ఎంక్వయిరీ చేయగా
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
రోజూ గుప్పెడు తింటే ఇన్ని లాభాలా.? తెలిస్తే అసలు వదిలిపెట్టరు..
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!
ఎవరికైనా బిచ్చం వేస్తున్నారా.! ఇక మీ పైనా కేసు తప్పదు.!