AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్.. పేర్లు బయట పెట్టిన ఆది రెడ్డి

ప్రస్తుతానికి 10 మంది కంటెస్టెంట్స్ తోనే బిగ్ బాస్ హౌస్ రన్ అవుతోంది. దీంతో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. శనివారం (అక్టోబర్ 05) లేదా ఆదివారం (అక్టోబర్ 06) ఏదో ఒక రోజున వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడతారని ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే గత కొన్ని రోజులుగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీపై బిగ్ బాస్ నిర్వాహకులు వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ హౌస్‌లోకి 8 మంది వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్.. పేర్లు బయట పెట్టిన ఆది రెడ్డి
Bigg Boss 8 Telugu
Basha Shek
|

Updated on: Oct 04, 2024 | 4:15 PM

Share

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. సెప్టెంబర్ 1 న ప్రారంభమైన కొత్త సీజన్ లో ఇప్పటికే నాలుగు వారాలు పూర్తయ్యాయి. ఐదో వారం కూడా పూర్తి కావొచ్చింది. గత సీజన్ లాగే ఈసారి కూడా మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అయ్యారు. బెజవాడ బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. దీంతో ప్రస్తుతానికి 10 మంది కంటెస్టెంట్స్ తోనే బిగ్ బాస్ హౌస్ రన్ అవుతోంది. దీంతో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ఎంట్రీకి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. శనివారం (అక్టోబర్ 05) లేదా ఆదివారం (అక్టోబర్ 06) ఏదో ఒక రోజున వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెడతారని ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే గత కొన్ని రోజులుగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంట్రీపై బిగ్ బాస్ నిర్వాహకులు వరుసగా అప్డేట్స్ ఇస్తున్నారు. పేరు చెప్పకుండా వారి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆడియెన్స్ ను ఊరిస్తున్నారు. ఇక గత ఎపిసోడ్ చూసుకుంటే.. ‘మీరు మీకు ఇచ్చిన ఛాలెంజెస్ అన్నిటిని పూర్తి చెయ్యని కారణంగా హౌస్‌లోకి ఎనిమిది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీ మీదకు తుఫానులా దూసుకు వస్తున్నాయి’ అంటూ మరో హింట్ ఇచ్చాడు బిగ్ బాస్.

ఇవి కూడా చదవండి

ఈ నేపథ్యంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చే ఆ ఎనిమిది కంటెస్టెంట్స్ ఎవరా అని బిగ్ బాస్ ఆడియెన్స్ లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో పలు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే గతంలో బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టి, ఇప్పుడు బిగ్ బాస్ షోపై రివ్యూలు ఇస్తోన్న ఆది రెడ్డి దీనిపై ఒక వీడియోను రిలీజ్ చేశాడు. ఇందులో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల వివరాలతో పాటు సమయం కూడా చెప్పేశాడు. ఆది రెడ్డి ప్రకారం.. మెహబూబ, హరితేజ, నయనీ పావని, ముక్కు అవినాష్, గౌతమ్ కృష్ణ, రోహిణి, గంగవ్వ, టేస్టీ తేజ వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని తెలుస్తోంది. ఈ శనివారం (అక్టోబర్ 05) ఎపిసోడ్ లోనే వీరి ఎంట్రీ ఉంటుందని చెప్పుకొచ్చాడు ఆది రెడ్డి. మరి ఇతని మాటల్లో ఎంత నిజముందో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.

జాబితా ఇదిగో.. వీడియో

 బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..