Thalapathy Vijay: దళపతి విజయ్ ఆఖరి సినిమా.. బాలయ్య నటించిన ఆ మూవీనే రీమేక్ చేయనున్నాడా?

తమిళ సూపర్ స్టార్ విజయ్ 'ది గోట్' సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లే వచ్చాయి. అయితే ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో అభిమానులు   బాధపడుతున్నారు. దీంతో ఆఖరి సినిమా విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు విజయ్

Thalapathy Vijay: దళపతి విజయ్ ఆఖరి సినిమా.. బాలయ్య నటించిన ఆ మూవీనే రీమేక్ చేయనున్నాడా?
Balakrishna, Vijay Thalapathy
Follow us

|

Updated on: Oct 02, 2024 | 3:35 PM

తమిళ సూపర్ స్టార్ విజయ్ ‘ది గోట్’ సినిమాతో మరో సూపర్ హిట్ అందుకున్నాడు. కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లే వచ్చాయి. అయితే ఆశించిన స్థాయిలో సినిమా లేకపోవడంతో అభిమానులు   బాధపడుతున్నారు. దీంతో ఆఖరి సినిమా విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు విజయ్. కాగా  ఇంతకు ముందు విడుదలైన ‘లియో’ చిత్రం ఘనవిజయం సాధించిందని చెప్పవచ్చు. ఇప్పుడు ‘దళపతి 69’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు హెచ్. వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. కన్నడ నిర్మాణ సంస్థ కెవిఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తుండడం విశేషం. ఇప్పుడు ఈ సినిమా కథ గురించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం సమకూరుస్తున్నారు. పూజా హెగ్డే, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్ ఈ సినిమా టీమ్‌లో జాయిన్ అయ్యారు. అలాగే మలయాళ నటి మమతా బైజు కూడా ఈ సినిమాలో భాగమైనట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్‌కి సోదరి పాత్రలో ఆమె నటిస్తున్నట్లు సమాచారం. కాగా దళపతి విజయ్ ఆఖరి సినిమా ఓ తెలుగు సినిమాకు రీమేక్ అని తెలుస్తోంది. అదేదో కాదు.. బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’. ఈ సినిమాలో కమర్షియల్ అంశాలతో పాటు అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉంది.

గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తో పాటు ఆడపిల్లలను పేరెంట్స్ ఎలా పెంచాలనే మెసేజ్ ఓరియంటెడ్ కథతో తెరకెక్కిన భగవంత్ కేసరి నే తనకు సేఫ్ సైడ్ అని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ‘దళపతి 69’ తర్వాత విజయ్ రాజకీయాల్లో బిజీ కానున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన ఇప్పటికే పార్టీని ప్రకటించడం విశేషం. అందుకే ఆయన ఆఖరి సినిమా రాజకీయాలకు సంబంధించి ఉంటుందని అంటున్నారు. సినిమా టైటిల్ రివీల్ అయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.

ఇవి కూడా చదవండి

కాగ విజయ్ రాజకీయాల్లోకి రావడంతో ఆయన అభిమానుల్లో చాలా మంది నిరాశకు లోనవుతున్నారు. ఎందుకంటే రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సినిమా రంగాన్ని పూర్తిగా వదిలేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఇటీవల విజయ్ నటించిన ది గోట్ సినిమాను అక్టోబర్ 3న OTTలో విడుదల చేయనున్నారు.

 విజయ్ ఆఖరి సినిమా అనౌన్స్ మెంట్..

ఎన్నికలకు ముందు రిలీజయ్యేలా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..