AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Venu Swamy: ‘వారిది ఓవర్ యాక్షన్.. క్షమాపణలు చెప్పాల్సిందే’.. తిరుపతి లడ్డూ పై వేణుస్వామి భార్య కామెంట్స్

తిరుమల లడ్డూ వివాదం పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీవారి లడ్డూను రాజకీయం చేయొద్దని, కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దీనిపై పలువురు ప్రముఖులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. తిరుమల లడ్డూపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు

Venu Swamy: 'వారిది ఓవర్ యాక్షన్.. క్షమాపణలు చెప్పాల్సిందే'.. తిరుపతి లడ్డూ పై వేణుస్వామి భార్య కామెంట్స్
Tirumala Laddu
Basha Shek
|

Updated on: Oct 01, 2024 | 11:00 AM

Share

తిరుమల లడ్డూ వివాదం పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీవారి లడ్డూను రాజకీయం చేయొద్దని, కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దీనిపై పలువురు ప్రముఖులు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. తిరుమల లడ్డూపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి భార్య వీణా శ్రీవాణి కూడా తిరుమల లడ్డూ వివాదంపై స్పందించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తన అభిప్రాయాలను ఒక వీడియో రూపంలో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అందులో ఇలా చెప్పుకొచ్చింది.’ పరమ పవిత్రమైన తిరుపతి లడ్డూ కోసం సోషల్ మీడియాలో ఎంత రచ్చ రచ్చ చేశారు. ప్రజలు, భక్తుల మనోభావాలను దెబ్బ తీశారు. రాజకీయ నాయకుల సంగతి పక్కన బెడితే.. ప్రవచనకర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఏమన్నా ఓవర్ యాక్టింగ్ చేశారా..? ప్రాయశ్చిత్త శ్లోకాలు వారే కనిపెట్టేసి.. వాటిని చెప్పించేసి, ఏమన్నా రచ్చ చేశారా? వీళ్లు ఎంతో మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. ఇప్పుడు వారంతా ఏం చేస్తారు. మీరు నిజమైన హిందువులైతే.. వెంకటేశ్వరస్వామి భక్తులైతే.. మమ్మల్ని క్షమించండి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా? పెట్టండి ఎంతమంది పెడతారో చూస్తాను” అని చెప్పుకొచ్చింది.

శ్రీవాణి రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కాగా ఆ మధ్యన నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్లల జాతకం చెప్పి చిక్కుల్లో పడ్డారు వేణు స్వామి. దీంతో అభిమానులతో పాటు చాలా మంది ఈ స్వామిజీపై తీవ్రంగా మండి పడ్డారు. పోలీసు కేసులు కూడా పెట్టారు. దీని తర్వాత ఓ ప్రముఖ టీవీ ఛానల్ లో పని చేస్తున్న జర్నలిస్ట్ తమను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని… రూ. 5కోట్లు ఇవ్వాలంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు వేణుస్వామి దంపతులు. దీనికి సంబంధించిన వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

తిరుమల లడ్డూ వివాదంపై వేణు స్వామి భార్య కామెంట్స్.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి