Shraddha Kapoor: బాలీవుడ్‌లో హిట్ అవుతున్న భయం కాన్సెప్ట్.! మార్క్ క్రియేట్ చేసిన శ్రద్ధా.
ఖాన్‌ల సినిమాలకు వచ్చే కలెక్షన్లు ఓ లేడీ ఓరియంటెడ్ మూవీకి వచ్చాయంటే ఆనందించాలో, ఆశ్చర్యపోవాలో అర్థం కావడం లేదంటున్నారు శ్రద్ధా కపూర్. సక్సెస్ అంటే ఇలా ఉండాలి. జీవితాంతం గుర్తుండిపోయేలా అంటూ వస్తున్న మెసేజ్‌లు చూస్తుంటే కడుపునిండిపోతుందట సాహో బ్యూటీకి. అప్పుడెప్పుడో డార్లింగ్ ప్రభాస్‌తో సాహో చేసిన శ్రద్ధా కపూర్ ఆ తర్వాత సౌత్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు.