- Telugu News Photo Gallery Cinema photos Which movie will create boxoffice magic in Pushpa 2, Game Changer and Kanappa
Tollywood News: ఆఖరి మూడు నెలల్లో మ్యాజిక్ చేసేదెవరు ??
కొత్త సంవత్సరం మొదలయ్యీ కాగానే హిట్లూ, ఫ్లాపులూ అంటూ భారీ సినిమాల కోసం ఆడియన్స్ ఎంతగా ఎదురుచూస్తారో, ఇయర్ ఎండింగ్‌లోనూ అదే సందడి రిపీట్ అవుతుంది. మనకు ఇంకో మూడు నెలలు మిగిలున్నాయి. రిలీజ్‌కి మేం రెడీ అంటూ ఆల్రెడీ డిక్లేర్ చేసిన సినిమాల నెంబరూ పెద్దదే. వాటిలో బిగ్ నెంబర్స్ ఆశిస్తున్న మూవీస్ ఏంటి? చూసేద్దాం పదండి...
Updated on: Oct 01, 2024 | 8:02 PM

కొత్త సంవత్సరం మొదలయ్యీ కాగానే హిట్లూ, ఫ్లాపులూ అంటూ భారీ సినిమాల కోసం ఆడియన్స్ ఎంతగా ఎదురుచూస్తారో, ఇయర్ ఎండింగ్‌లోనూ అదే సందడి రిపీట్ అవుతుంది. మనకు ఇంకో మూడు నెలలు మిగిలున్నాయి. రిలీజ్‌కి మేం రెడీ అంటూ ఆల్రెడీ డిక్లేర్ చేసిన సినిమాల నెంబరూ పెద్దదే. వాటిలో బిగ్ నెంబర్స్ ఆశిస్తున్న మూవీస్ ఏంటి? చూసేద్దాం పదండి...

తాజాగా ఈ చిత్ర కథపై మేజర్ అప్‌డేట్ ఇచ్చారు దిల్ రాజు. గేమ్ ఛేంజర్‌లో తెలుగు రాష్ట్రాల రాజకీయాలుంటాయా అనే అనుమానాలు ఇన్నాళ్లూ ఉండేవి.. కానీ ఉంటాయని తేల్చేసారు నిర్మాత దిల్ రాజు.

జరగండి జరగండి అంటూ దూసుకురావడానికి రెడీ అవుతోంది గేమ్ చేంజర్. ఆల్రెడీ ప్రమోషన్లలో స్పీడు పెంచేశారు మేకర్స్. క్రిస్మస్ కానుకగా సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత చెర్రీ, ఆచార్యలో తళుక్కున మెరిసినా... ఈ సినిమా కోసం మెగా పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఇష్టంగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్‌లోనే కనులవిందుకు సిద్ధమవుతున్నాడు కన్నప్ప.

విష్ణు మంచు ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా కన్నప్ప. భారీ మల్టీస్టారర్‌గా ఇప్పటికే క్రేజ్ తెచ్చుకుంది. భక్తి చిత్రాలకు జనాల ఆదరణ బాగా కనిపిస్తున్న ఈ సమయంలో కన్నప్ప రిజల్ట్ ఎలా ఉంటుందోననే ఆసక్తి మొదలైంది. చాన్నాళ్లుగా హిట్ కోసం వెయిట్ చేస్తుంది విష్ణు మాత్రమే కాదు.. గోపీచంద్ కూడా. ఆయన నటించిన విశ్వమ్ సినిమా దసరా బరిలో నిలుస్తోంది.

గోపీచంద్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోంది విశ్వం. చిత్రాలయం వేణు దోనేపూడి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అక్టోబర్ 11న విడుదల కానుందీ సినిమా. విశ్వం సినిమాకు ఒక్కరోజు ముందు అంటే, అక్టోబర్ 10న ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు సూపర్ స్టార్ రజనీకాంత్.

అది పక్కా ఊరమాస్ రోల్. సో, నియర్ ఫ్యూచర్‌లో పక్కా కమర్షియల్, యాక్షన్, ఊర మాస్ రోల్స్ లో మాత్రమే కనిపించాలని ఫిక్సయిపోయారు నడిప్పిన్ నాయగన్.



