AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

థియేటర్స్‌లో ఎక్కలేదు.. ఓటీటీలో తెగ చూసేస్తున్నారు.. పెద్ద హీరోలు, హీరోయిన్స్ లేరు

ప్రస్తుతం ఓటీటీల్లో కంటెంట్ నచ్చితే చాలు చిన్న సినిమాలను హిట్ చేస్తున్నారు. ముఖ్యంగా థియేటర్లలో డిజాస్టర్ అయిన సినిమాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై మంచి రెస్పాన్స్ వస్తుంది. స్టార్ హీరోహీరోయిన్స్ లేకపోయినా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న సినిమాలు దూసుకుపోతున్నాయి .

థియేటర్స్‌లో ఎక్కలేదు.. ఓటీటీలో తెగ చూసేస్తున్నారు.. పెద్ద హీరోలు, హీరోయిన్స్ లేరు
Movie
Rajeev Rayala
|

Updated on: Mar 15, 2026 | 8:58 PM

Share

ఓటీటీల సినిమాల గురించి ప్రతేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు ఓటీటీలో దూసుకుపోతున్నాయి. ప్రతి వారం పదుల సంఖ్యలో ఓటీటీలోకి వచ్చి సందడి చేస్తున్నాయి. తెలుగు సినిమాలే కాదు డబ్బింగ్ సినిమాలు కూడా ఓటీటీలో దూసుకుపోతున్నాయి. లవ్ స్టోరీలు, హారర్, సస్పెన్స్, థ్రిల్లర్, మిస్టరీ చిత్రాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఓ సినిమా ఓటీటీలో సెన్సేషన్ అవుతుంది. నిజానికి ఈ మూవీ థియేటర్లలో వచ్చినప్పుడు ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఈ తెలుగు రొమాంటిక్ సినిమాను చూసేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరు కన్యాకుమారి. కన్యాకుమారి.. ఈ చిత్రానికి సృజన్ అట్టాడ దర్శకత్వం వహించగా.. ఆగస్ట్ 17న థియేటర్లలో విడుదలైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ అంతగా రాణించలేకపోయింది. ఇటీవలే సెప్టెంబర్ 17న ఓటీటీలో రిలీజ్ అయ్యింది.ఇప్పుడు ఈ మూవీ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. స్టార్స్ లేకపోయినా అద్భుతమైన, ఎమోషనల్ కథతో దూసుకుపోతుంది.

ఎలాంటి గ్లామర్ టచ్ లేకుండానే పల్లెటూరి నేపథ్యంలో వచ్చిన ఈ ప్రేమకథకు ఇప్పుడు యూత్ తెగ అట్రాక్ట్ అవుతున్నారు. ప్రేమ, జీవితం, బ్రేకప్ వంటి అంశాలతో ఈ సినిమా సాగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోస్, ఆహా ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో గీత్ సైనీ ప్రధాన పాత్రలో నటించగా.. శ్రీచరణ్ హీరోగా నటించారు. రవి నిడమర్తి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీ క్లిప్స్ సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు జనాలు. ఈ సినిమాను ఓటీటీలో మిస్ అవ్వకండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
సాధారణ కాఫీకి బదులుగా.. ఇలా వాల్‌నట్ మిల్క్ కాఫీని ట్రై చేయండి..
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
బాలయ్యకు ఒక్క మెసేజ్ చేశా.. ఆరోజు ఆయనలో నాకు దేవుడు కనిపించాడు
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
హోటల్ స్టైల్ రవ్వ ఉప్మా రహస్యం..ఇలా చేస్తే అందరూ ఇష్టంగా తింటారు!
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇల్లు వదిలి వెళ్లిన బాలుడు బురద గుంటలో ఇలా.. క్లైమాక్స్ ఊహించలేరు
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇష్టమైన వాళ్ళు దూరమైన తర్వాతే విలువ ఎందుకు తెలుస్తుంది?
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఇది పండుకానీ పండు.. కనిపిస్తే వదలకండి.. ఆ రోగాలకు సూపర్ మెడిసిన్!
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
ఆవును వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళాడు..! తర్వాత..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
బాలయ్య గురించి చాలామందికి తెలియని విషయాలు మీకోసం..
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
రూ.1.10 లక్షల కోట్ల భూములకు రక్షణ.. ప్రభుత్వ స్థలాలకు హైడ్రా అండ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ
లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత.. శోకసంద్రంలో సినీ పరిశ్రమ