- Telugu News Photo Gallery Cinema photos Actress Ananya Panday Conditions For Doing Special Song In Movie
Tollywood: స్పెషల్ సాంగ్స్ చేయాలంటే ఆ కండీషన్స్ పక్కా.. ఈ హీరోయిన్ డిమాండ్స్ వింటే షాకే..
ఒకప్పుడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయాలంటే హీరోయిన్స్ అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు అగ్ర కథానాయికలే స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ సినీ తారలు కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బ్యూటీ రెడీ అయ్యింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్
Updated on: Oct 01, 2024 | 9:40 AM

ఒకప్పుడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయాలంటే హీరోయిన్స్ అంతగా ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఇప్పుడు అగ్ర కథానాయికలే స్పెషల్ సాంగ్స్ చేస్తున్నారు. టాలీవుడ్, బాలీవుడ్ సినీ తారలు కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో బ్యూటీ రెడీ అయ్యింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనన్య పాండే తనకు స్పెషల్ సాంగ్స్ చేయాలంటే ఎలాంటి అభ్యంతరం లేదంటోంది. కానీ తనకంటూ తనకంటూ కొన్ని కండీషన్స్ ఉన్నాయట. స్పెషల్ సాంగ్ చేయడానికి రెడీ.. కానీ మరి అతిగా అందాల ప్రదర్శన ఉండకూడదు అంటోంది.

పాటలో తన పాత్రకు గౌరవం ఇవ్వాలి.. లేదంటే సాంగ్ చేయదట. పాటలో అమ్మాయిని చూపించే విధానంలో రకరకాల పద్దతులు ఉన్నాయి. ఏళ్ల తరబడి చిత్రీకరిస్తున్న పద్దతినే ఇప్పటికీ అనుసరించాల్సిన అవసరం లేదంటోంది అనన్య.

పాటలో అమ్మాయిని అందంగా చూపించాలని.. కానీ బొమ్మగా మాత్రం చూపించొద్దని.. ఎక్కడ ఎలా నడుచుకోవాలనే అధికారం పూర్తిగా తనకే ఇవ్వాలని అంటుంది. ఈ కండీషన్స్ ఒప్పుకుంటేనే స్పెషల్ సాంగ్ చేస్తానని అంటోంది అనన్య.

హిందీలో పలు చిత్రాల్లో నటించిన అనన్య.. ఇటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ మూవీతో ఇటు దక్షిణాది సినీప్రియులకు పరిచయం అయ్యింది. ప్రస్తుతం అనన్య చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి.

స్పెషల్ సాంగ్స్ చేయాలంటే ఆ కండీషన్స్ పక్కా.. ఈ హీరోయిన్ డిమాండ్స్ వింటే షాకే..




