AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీలాంటి వాళ్ళకి పిల్లలు పుడితే చచ్చిపోవాలి అంటున్నారు.. ఎమోష్నలైన స్టార్ సింగర్

సోషల్ మీడియా ద్వారా చాలా మంది సెలబ్రెటీలు ట్రోల్స్ బారిన పడుతుంటారు. కొందరు ఏం చేసినా నెటిజన్స్ వారి పై నెగిటివ్ కామెంట్స్ చేయడం, ట్రోల్స్ చేయడంలాంటివి చేస్తుంటారు. తాజాగా ఓ సింగర్ దీని పై ఆవేదన వ్యక్తం చేసింది .

నీలాంటి వాళ్ళకి పిల్లలు పుడితే చచ్చిపోవాలి అంటున్నారు.. ఎమోష్నలైన స్టార్ సింగర్
Tollywood Singer
Rajeev Rayala
|

Updated on: Mar 07, 2026 | 3:34 PM

Share

సోషల్ మీడియా వినియోగం ఎక్కువైంది. చాలామందికి సోషల్ మీడియా అనేది జీవితంలో ఓ భాగం అయ్యింది. పొద్దున్న లెగిస్తే సోషల్ మీదితోనే గడిపేస్తున్నారు కొందరు.. ఇక సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉంటుందో నష్టం కూడా అంతే ఉంటుంది. సోషల్ మీడియా వల్ల చాలా మంది నటీనటులు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. నిత్యం హీరోయిన్స్ కు సంబంధించిన వార్తలు, వ్యక్తిగత విషయాలు వైరల్ అవుతుంటాయి. ఇక కొంతమంది కావాలనే హీరోయిన్స్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని వాపోయారు. ఇటీవలే అందాల నటి, యాంకర్ అనసూయ కూడా తనపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారని, నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా మరో సెలబ్రెటీ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై ఆవేదన వ్యక్తం చేసింది ఆమె ఎవరో కాదు స్టార్ సింగర్ చిన్మయి.

సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది చిన్మయి శ్రీపాద. అదే సమయంలో మీటూ, క్యాస్టింక్ కౌచ్ వంటి విషయాల్లో తన గొంతకను బలంగా వినిపించింది. తమిళ సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులపై సంచలన ఆరోపణలు చేసింది. దీంతో తమిళ సినిమా ఇండస్ట్రీ ఆమెపై నిషేధం విధించింది. అయితేనేం తన పోరాటం ఆపడం లేదీ ట్యాలెంటెడ్ సింగర్. సామాజిక మాధ్యమాల వేదికగా సామాజిక అంశాలు, సమస్యలపై తన దైన శైలిలో గళం వినిపిస్తుంటుంది.కొన్ని సార్లు చిన్మయి పోస్టులు వివాదాలకు దారి తీస్తుంటాయి. విమర్శలు కూడా వస్తుంటాయి. అయితేనేం తన నమ్ముకున్న దారిలోనే బలంగా వెళుతోంది చిన్మయి.

స్టాండ్ విత్ హెర్ ప్రోగ్రామ్ లో సింగర్ చిన్మయి పాల్గొంది. ఈ ప్రోగ్రామ్‌లో చిన్మయి ఓపెన్  కామెంట్స్ చేసింది. తనలా ఓపెన్ గా మాట్లాడితే సోషల్ మీడియాలో దాడికి పాల్పడుతున్నారని చిన్మయి తెలిపింది. నీలాంటి ఆడవాళ్లు ఉండకూడదు, నీలాంటి వాళ్ళకి పిల్లలు పుడితే చచ్చిపోవాలి.. ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారు. నా వెనుక నా భర్త సపోర్ట్ ఉంది అని తెలిపింది. స్టాండ్ విత్ హెర్ పేరుతో ప్రోగ్రామ్ చేయడం సంతోషంగా ఉంది అంటూ చిన్మయి చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us