Ram Charan: రామ్ చరణ్‌తో ఆటలాడుతోన్నఈ క్యూట్ బేబీ ఎవరో తెలుసా? క్లింకారా మాత్రం కాదండోయ్..

మెగా ప్రిన్సెస్ పుట్టి సుమారు ఏడాది గడుస్తోంది. కానీ ఇప్పటివరకు పాప ముఖాన్ని మాత్రం బయటకు చూపించలేదు. క్లింకార ఫేస్ రివీల్ కాకుండా రామ్ చరణ్ - ఉపాసన దంపతులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ చిన్నారి ఫొటోలు ఎప్పుడెప్పుడు బయటకు వస్తాయా? అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కూతురు క్లింకార అంటూ సోషల్ మీడియాలో ఒక ఫొటో తెగ వైరల్ అవుతోంది.

Ram Charan: రామ్ చరణ్‌తో ఆటలాడుతోన్నఈ క్యూట్ బేబీ ఎవరో తెలుసా? క్లింకారా మాత్రం కాదండోయ్..
Ram Charan
Follow us

|

Updated on: Sep 30, 2024 | 8:41 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు కొన్ని నెలల క్రితమే అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. పెళ్లైన 11 ఏళ్ల తర్వాత పాప పుట్టడంతో మెగా ఫ్యామిలీతో పాటు అభిమానులు కూడా ఘనంగా సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత బారసాల వేడుకను అట్టహాసంగా నిర్వహించి తమ కూతురికి క్లింకార కొణిదెల అని పేరు పెట్టారు రామ్ చరణ్- ఉపాసన దంపతులు. అయితే మెగా ప్రిన్సెస్ పుట్టి సుమారు ఏడాది గడుస్తోంది. కానీ ఇప్పటివరకు పాప ముఖాన్ని మాత్రం బయటకు చూపించలేదు. క్లింకార ఫేస్ రివీల్ కాకుండా రామ్ చరణ్ – ఉపాసన దంపతులు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ చిన్నారి ఫొటోలు ఎప్పుడెప్పుడు బయటకు వస్తాయా? అని మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ కూతురు క్లింకార అంటూ సోషల్ మీడియాలో ఒక ఫొటో తెగ వైరల్ అవుతోంది. ఇందులో యల్లో అండ్ పింక్ గుర్రపు బొమ్మపై ముద్దుగా కూర్చున్న చిన్నారి.. రామ్ చరణ్ ముక్కుపై చేయి పెట్టి ఆటలు ఆడుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్లింకార చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అయితే వాస్తవానికి ఆ పాప రామ్ చరణ్ కూతురు క్లింకార కొణిదెల కాదు. చెర్రీ సోదరి శ్రీజ కూతురు. ఇది కూడా త్రో బ్యాక్ ఫొటో. గతంలో ఎప్పుడో దిగిన ఈ ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతోంది. శ్రీజ కూతురు కూడా ఇప్పుడు చాలా పెద్దది అయ్యింది. ప్రస్తుతం ఈ క్యూట్ పాపాయి ఫొటో నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. తమన్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ కానుకగా గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కావొచ్చని తెలుస్తోంది.

 గేమ్ ఛేంజర్  రా మచ్చా మచ్చా’ సాంగ్ లిరికల్ వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.