Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఇది మాములు మేకోవర్ కాదు… పోలీస్‌ డ్రెస్‌లో కేక పెట్టించిన హాట్ బ్యూటీ.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో పోలీస్ డ్రెస్ లో కేక పెట్టిస్తోన్న నటిని గుర్తు పట్టారా? ఈమె టాలీవుడ్ లో బాగా ఫేమస్. చాలా మంది కుర్రకారు కలల రాకుమారి. అలాగనీ ఆమె స్టార్ హీరోయిన్ కాదు. కేవలం స్పెషల్ సాంగ్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ తోనే క్రేజ్ తెచ్చుకుంది. అయితే అందాలు ఆరబోయడంలో ఏ మాత్రం వెనకాడదీ అందాల తార

Tollywood: ఇది మాములు మేకోవర్ కాదు... పోలీస్‌ డ్రెస్‌లో కేక పెట్టించిన హాట్ బ్యూటీ.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Sep 29, 2024 | 7:04 PM

పై ఫొటోలో పోలీస్ డ్రెస్ లో కేక పెట్టిస్తోన్న నటిని గుర్తు పట్టారా? ఈమె టాలీవుడ్ లో బాగా ఫేమస్. చాలా మంది కుర్రకారు కలల రాకుమారి. అలాగనీ ఆమె స్టార్ హీరోయిన్ కాదు. కేవలం స్పెషల్ సాంగ్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ తోనే క్రేజ్ తెచ్చుకుంది. అయితే అందాలు ఆరబోయడంలో ఏ మాత్రం వెనకాడదీ అందాల తార. అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. అన్నట్లు ఈ సొగసరి త్వరలోనే హీరోయిన్ గా అదృష్టం పరీక్షించుకోనుంది. ఇప్పటివరకు స్పెషల్ సాంగ్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్స్ లో కేక పెట్టించిన ఈ అమ్మడు ఇప్పుడు కథానాయికగా మారనుంది. ఆమె ప్రధాన పాత్ర పోషిస్తోన్న రెండు లేడీ ఓరియంటెడ్ సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ అందాల తార ఎవరో గుర్తు పట్టారా? కష్టంగా ఉందా? అయితే మీకో క్లూ.. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు ఈ బ్యూటీ ఫేవరెట్ హీరోయిన్. ఆయన తెరకెక్కించిన పలు సినిమాల్లో నటించిందీ ముద్దుగుమ్మ. యస్..ఈ పోలీసమ్మ మరెవరో కాదు అప్సరా రాణి. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ సొగసరి తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ లో ఈ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో పోలీస్ డ్రెస్ లో కనిపిస్తూ, గన్ పట్టుకుని పోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఈ ఫొటోలను చూసిన చాలా మంది ఆమెను గుర్తు పట్టలేకపోయారు? ఆ తర్వాత అప్సరా రాణి అని తెలుసుకుని ఆశ్చర్యానికి లోనయ్యారు.

అప్సరా రాణి ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో ఒక ద్వి భాషా చిత్రం తెరకెక్కుతోంది. బ్లడ్ రోజెస్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అప్సరా రాణి పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించనుంది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన స్టిల్స్ నే సోషల్ మీడియాలో షేర్ చేసింది. వాటికి ‘సత్య మేవ జయతే’ అని క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది.

ఇవి కూడా చదవండి

పోలీస్ డ్రెస్ లో అప్సరా రాణి..

在 Instagram 查看这篇帖子

Apsara Rani (@apsararaniofficial_) 分享的帖子

దీంతో  పాటు  అప్సరా రాణి ‘రాచరికం’ అనే మరో డిఫరెంట్ మూవీలో నటిస్తోంది. ఇందులో  విజయ్ శంకర్, వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  ఈశ్వర్ నిర్మాతగా చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. సురేశ్ లంకలపల్లి ఈ చిత్రానికి దర్శకుడు

అప్సరా రాణి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

在 Instagram 查看这篇帖子

Apsara Rani (@apsararaniofficial_) 分享的帖子

దేవర సినిమా మరో అరుదైన ఘనత..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంకటహర చతుర్థి.. కష్టాలు తీర్చే గణపతి పూజ.. ఫలితాలివే!
సంకటహర చతుర్థి.. కష్టాలు తీర్చే గణపతి పూజ.. ఫలితాలివే!
10th సప్లిమెంటరీ ఫలితాల్లో ప్రకాశం జిల్లా సత్తా..
10th సప్లిమెంటరీ ఫలితాల్లో ప్రకాశం జిల్లా సత్తా..
జగన్నాథునికి వేప పొడిని నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారో తెలుసా..
జగన్నాథునికి వేప పొడిని నైవేద్యంగా ఎందుకు సమర్పిస్తారో తెలుసా..
మీరు రైలు లేదా కోచ్‌ను బుక్‌ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి
మీరు రైలు లేదా కోచ్‌ను బుక్‌ చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చేయండి
థియేటర్‌లో డాన్స్‌తో రచ్చ చేసిన నవీన్ చంద్ర..
థియేటర్‌లో డాన్స్‌తో రచ్చ చేసిన నవీన్ చంద్ర..
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ
వచ్చే 3 రోజులు భారీ వర్షాలు.. వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ
UPSC సివిల్‌ సర్వీసెస్ 2025కు ఉచిత కోచింగ్‌.. దరఖాస్తు ఇలా చేయండి
UPSC సివిల్‌ సర్వీసెస్ 2025కు ఉచిత కోచింగ్‌.. దరఖాస్తు ఇలా చేయండి
శనివారం పొరపాటున కూడా ఈ వస్తువులు కొనవద్దు.. ఎందుకంటే
శనివారం పొరపాటున కూడా ఈ వస్తువులు కొనవద్దు.. ఎందుకంటే
రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం.. తులం ధర 1 లక్షా 20 వేల చేరవలో..
రికార్డ్‌ సృష్టిస్తున్న బంగారం.. తులం ధర 1 లక్షా 20 వేల చేరవలో..
APPSC జూనియర్‌ లెక్చరర్‌ కొత్త పరీక్ష తేదీలు 2025 వచ్చేశాయ్‌..
APPSC జూనియర్‌ లెక్చరర్‌ కొత్త పరీక్ష తేదీలు 2025 వచ్చేశాయ్‌..