AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukumar: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా? అసలు ఊహించలేరు

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆర్యతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ అయిన పుష్ప 2 షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్.

Sukumar: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా? అసలు ఊహించలేరు
Director Sukumar
Basha Shek
|

Updated on: Sep 28, 2024 | 9:58 PM

Share

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఆర్యతో మొదలైన ఆయన సినీ ప్రస్థానం పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ అయిన పుష్ప 2 షూటింగ్ పనుల్లో బిజీగా ఉంటున్నాడీ ట్యాలెంటెడ్ డైరెక్టర్. అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. కాగా డైరెక్టర్ గానే కాకుండా నిర్మాతగానూ సత్తా చాటారు సుకుమార్. కథ నచ్చితే తన బ్యానర్ లోనే సినిమాలు తీసేందుకు రెడీగా ఉంటారాయన. అలాగే ఇతర సినిమాల ప్రమోషన్లకు కూడా హాజరవుతుంటాడు. అలా సుకుమార్ తాజాగా నాన్న సూపర్ హీరో సినిమా టీజర్ చూశారు. అనంతరం హీరో సుధీర్ బాబుకు అభినందనలు తెలుపుతూ మెసేజ్ చేశాడు. దీంతో హీరో సుధీర్ బాబు కూడా ఆనందంతో మురిసిపోయాడు. సుకుమార్ చేసిన మెసేజ్ ని స్క్రీన్ షాట్ తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేసి థ్యాంక్స్ చెప్పాడు సుధీర్ బాబు. అయితే ఈ స్క్రీన్ షాట్ లో సుకుమార్ వాట్సాప్ డీపీ కూడా కనిపించింది. దీంతో ఒక్కసారిగా ఇది వైరల్ గా మారింది. ఇంతకీ డైరెక్టర్ సుకుమార్ తన వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా? కొన్నేళ్ల క్రితమే కన్నుమూసిన తన తండ్రి తిరుపతి రావు.

నాన్నకు ప్రేమతో..

దీనిపై స్పందించిన సుధీర్ బాబు ‘ మీ డీపీలో మీ నాన్నగారి ఫోటో ఉంది. మీ నాన్న గారంటే మీకు ఎంత ఇష్టమో తెలుస్తుంది. మా సినిమా కూడా నాన్నని సూపర్ హీరోగా చూసే ఓ అబ్బాయి కథ’ అని సుకుమార్ కు రిప్లై ఇచ్చారు. కాగా సుకుమార్ తండ్రి పేరు తిరుపతిరావు. ఆయన కొన్నేళ్ల క్రితం మరణించారు. సుకుమార్ తన తండ్రితో మంచి అనుబంధం ఉంది. అందుకే తన సినిమాల్లో తండ్రి పాత్రలకు బలమైన నేపథ్యముంటుంది. ఇక తన తండ్రి జ్ఞాపకార్థమే సుకుమార్ గతంలో తన సొంతూరిలో తండ్రి పేరు మీద స్కూల్ బిల్డింగ్ కూడా కట్టించాడు.

ఇవి కూడా చదవండి

సుధీర్ బాబు ట్వీట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు
పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు