తగ్గేదేలే అనే పదం వాడితే ఎలా ఉంటుందో.. తగ్గకపోవడం అంటే ఏంటో పుష్పరాజ్ ఆల్రెడీ ప్యాన్ ఇండియా ప్రేక్షకులకు టేస్ట్ చూపించేశాడు. నెక్స్ట్.. అసలు తగ్గేదేలే అనే పదానికి డెఫినిషన్ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాడు. ప్రిపరేషనే జనాల్లో ట్రెండ్ అవుతుంటే, ప్రాడక్ట్ ఇంకెలా ఉంటుంది అంటారా.? వెయ్యి కోట్ల మార్క్.. ఓవరాల్ కలెక్షన్లు చూశాక మాట్లాడుకునే టాపిక్ ఇది.. కానీ పుష్ప సీక్వెల్‌కి మాత్రం వెయ్యి కోట్ల టాపిక్ ప్రీ రిలీజ్ బిజినెస్ టైమ్‌లోనే ఊరిస్తోంది.