Sai pallavi Vs Sreeleela: శ్రీలీల, సాయిపల్లవి.. క్రేజ్ ఉంది, టాలెంట్ ఉంది.. అయినా ఎందుకు వెనకే.?
క్రేజ్ ఉంది.. చేతిలో సినిమాలున్నాయి.. ప్రతి రోజూ మేకప్ వేసుకుంటూనే ఉన్నారు. అయినా ఎందుకు జనాల ముందుకు రావడం లేదు. ఎక్కడో కనిపించకుండా పోయినట్టు ఫ్యాన్స్ కి ఓ వెలితి... డ్యాన్సింగ్ డాల్స్ సాయిపల్లవి అండ్ శ్రీలీల విషయంలో ఇప్పుడు ఇలాంటి వెలితినే ఫీలవుతున్నారు జనాలు. సాయిపల్లవి ప్యాన్ ఇండియా వెంచర్స్ తో ప్రిపేర్ అవుతున్నారు. ఇన్నాళ్లూ సౌత్‌లోనే హవా చూపించిన ఈ లేడీ పవర్‌స్టార్ ఇప్పుడు నార్త్ లోనూ సినిమాలు చేస్తున్నారు.