- Telugu News Photo Gallery Cinema photos Heroine Sobhita Dhulipala New Post on Naga chaitanya and her kids goes trending in social media
Sobhita Dhulipala-Naga Chaitanya: శోభిత పోస్టులో అంత అర్థం ఉందా.? లైఫ్‌లోనూ అంత ప్రేమించే వ్యక్తి దొరకడం..
త్వరలో పెళ్లి పీటలెక్కనున్న శోభితకు ఇవాళ చాలా స్పెషల్ డే. ఆమె నటించిన లవ్ సితార రిలీజ్ అయింది. అంతే కాదు, తన ప్రేమ గురించి, నిశ్చితార్థం సమయంలో తాను పెట్టిన పోస్టు గురించి కూడా చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు శోభిత. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు నటి శోభిత దూళిపాల. ఆమె నటించిన లవ్ సితార సినిమా ఇవాళ విడుదలైంది. ఈ సినిమాలోని సితార కేరక్టర్ తనలో చాలా స్ఫూర్తి పంచిందని చెప్పారు నటి శోభిత.
Updated on: Sep 29, 2024 | 10:09 PM

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న శోభితకు ఇవాళ చాలా స్పెషల్ డే. ఆమె నటించిన లవ్ సితార రిలీజ్ అయింది.

అంతే కాదు, తన ప్రేమ గురించి, నిశ్చితార్థం సమయంలో తాను పెట్టిన పోస్టు గురించి కూడా చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు శోభిత.

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు నటి శోభిత దూళిపాల. ఆమె నటించిన లవ్ సితార సినిమా ఇవాళ విడుదలైంది. ఈ సినిమాలోని సితార కేరక్టర్ తనలో చాలా స్ఫూర్తి పంచిందని చెప్పారు నటి శోభిత.

సితార కేరక్టర్ చాలా తెలివిగా ప్రవర్తించడం తనకు నచ్చిందన్నారు. లవ్ సితార కేరక్టర్ తనకు నిజ జీవితంలోనూ పర్ఫెక్ట్ గా సూటవుతుందని చెప్పారు శోభిత.

తాను కూడా సూటిగా, నిజాయతీగా ఉండటానికి ఇష్టపడతాననీ తెలిపారు. ప్రతి అమ్మాయి ధైర్యంగా ముందడుగు వేయాలని, సంకల్పం చాలా ముఖ్యమని అన్నారు.

తన నిశ్చితార్థ ఫొటోలు షేర్ చేస్తూ తమిళ సంగ సాహిత్యానికి సంబంధించిన లైన్లు పంచుకున్నారు శోభిత. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ సరళంగా ఉండే సంగ సాహిత్యం తనకు చాలా ఇష్టమని,

తనకి రియల్ లైఫ్‌లోనూ అంతే ప్రేమించే వ్యక్తి దొరకడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు శోభిత.




