Malavika Mohanan: ఎందుకు నన్ను అలా చూడాలనుకుంటున్నారు.. నెటిజన్ ప్రశ్నకు మాళవిక షాక్
రజినీకాంత్ నటించిన పేట, ధనుష్ హీరోగా నటించిన మారన్, అలాగే దళపతి విజయ్ హీరోగా వచ్చిన మాస్టర్ సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. దాంతో ఈ చిన్నదానికి మన దగ్గర కూడా క్రేజ్ ఏర్పడింది.
Updated on: Sep 29, 2024 | 7:37 PM

ఇండస్ట్రీలో నటనతో పాటు అందంతో ఆకట్టుకుంటున్న భామతో మాళవికామోహన్ ఒకరు. హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది అందాల భామమాళవిక మోహన్. పట్టం పోల్ అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది.

ఆ తర్వాత కన్నడ, హిందీ , తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది మాళవిక మోహన్. ఇక ఈ చిన్నది సూపర్ స్టార్ రజినీకాంత్, ధనుష్, దళపతి విజయ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ.

రజినీకాంత్ నటించిన పేట, ధనుష్ హీరోగా నటించిన మారన్, అలాగే దళపతి విజయ్ హీరోగా వచ్చిన మాస్టర్ సినిమాలు తమిళ్ తో పాటు తెలుగులోనూ విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. దాంతో ఈ చిన్నదానికి మన దగ్గర కూడా క్రేజ్ ఏర్పడింది.

ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో బిగ్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. ఇటీవల ప్రభాస్ సినిమాలో మాళవిక ఛాన్స్ అందుకుంది. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తోన్న రాజా సాబ్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది.

ఇటీవలే ఈ మూవీ షూటింగ్‌లోనూ జాయిన్ అయ్యింది. ఇదిలా తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్స్‌తో ముచ్చటించింది. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాదానాలు చెప్పింది. ఓ నెటిజన్ ఘోస్ట్ పాత్రలో మిమ్మల్ని ఎప్పుడు చూస్తాం? అని అడగ్గా.. మరీ అంత స్పెషల్ గా అడుగుతున్నారు. మీరు నన్ను దెయ్యంలా ఎందుకు చూడాలనుకుంటున్నారు.? అని సరదాగా సమాధానం చెప్పింది మాళవిక



















