Movie Updates: సముద్రం సాక్షిగా మెరుపులు.. సీ బ్యాక్ డ్రాప్‌లో సినిమాలు..
ఎప్పుడెప్పుడు... ఇంకెప్పుడు... ఇంకా ఎప్పుడు అని ఆరేళ్లుగా తమ హీరోని సోలోగా చూడాలనుకున్న నందమూరి అభిమానులకు ఆ క్షణాలు రానే వచ్చేశాయి. దేవర స్క్రీన్ల మీదకు దూసుకు వచ్చేశాడు. ఎర్ర సముద్రం సాక్షిగా దేవర మెరుపులు కురిపిస్తుంటే, సీ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న మిగిలిన సినిమాల గురించి డిస్కషన్ షురూ చేశారు నెటిజన్లు.
Updated on: Sep 30, 2024 | 8:31 AM

దేవర సక్సెస్ తరువాత వరుసగా మీడియాతో మాట్లాడుతున్న కొరటాల శివ, పార్ట్ 2 మీద అంచనాలు పెంచేస్తున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో అసలు కథ అంత సీక్వెల్‌లోనే ఉంటుందని, తొలి భాగంలో చూసింది 10 శాతమే అంటూ హైప్ పెంచేశారు.

ఇప్పుడు వార్2 పనుల్లో బిజీగా ఉన్నారు తారక్. ఆ వెంటనే నీల్ సినిమా సెట్స్ లోకి వెళ్తారు. మరోవైపు నెల్సన్‌తో సినిమా ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఆ తర్వాతగానీ దేవర2 షూటింగ్ సంగతులను తలచుకోరా? ఇప్పుడు ఇదో ఇంట్రస్టింగ్ డిస్కషన్.

ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేస్తామంటున్న తండేల్ మూవీ కూడా సముద్రం బ్యాక్‌డ్రాప్‌లోనే జరుగుతుంది. ఉత్తరాంధ్రలో జరిగే ప్రేమకథగా రూపొందిస్తున్నారు. లవ్‌స్టోరీకి, దేశభక్తిని ముడిపెడుతూ, ఉత్తరాంధ్ర నేపథ్యంతో తెరకెక్కిస్తున్నారు చందు మొండేటి.

ఇటు కేజీయఫ్ త్రీక్వెల్ కూడా సముద్రం నేపథ్యంలోనే ప్రధానంగా సాగనుంది. తాను అప్పటిదాకా తయారు చేయించిన బంగారాన్నంతా తీసుకుని సముద్రంలోకి వెళ్తాడు రాకీ భాయ్. అక్కడి నుంచి అతను ఎలా బయటపడ్డాడు? అక్కడి నుంచి ఎటు వెళ్తాడు? ఏం చేస్తాడనేది త్రీక్వెల్ కథ.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా కూడా సీ బ్యాక్‌డ్రాప్‌లోనే సాగుతుంది. ఓజీ చూద్దురుగానీ బావుంటుంది అంటూ ఫ్యాన్స్ కి ఈ సినిమా గురించి ఇప్పటికే పాజిటివ్ హింట్ ఇచ్చేశారు పవన్ కల్యాణ్. ఓజీలో సీ బ్యాక్‌డ్రాప్‌ని ఎంతగా వాడుకుంటారో తెలియాలంటే లెట్స్ వెయిట్ అండ్ సీ...




