- Telugu News Photo Gallery Cinema photos Director Koratala Siva responded to the news that there is a cold war with Chiranjeevi
Koratala Chiru: కొరటాల, చిరంజీవి మధ్య అంతా ఓకేనా..? కొరటాల ఏమన్నారంటే.?
కొరటాల, చిరంజీవి మధ్య అంతా ఓకేనా..? నిజంగా వాళ్ళిద్దరి మధ్య చెడిందా..? ఆచార్య ఫలితం చిరు, కొరటాల మధ్య చిచ్చు పెట్టిందా..? కొందరు దర్శకులకు విజన్ లేదని చిరు చేసిన వ్యాఖ్యలు ఎవర్ని ఉద్దేశించి..? పక్కోడి పనిలో వేలు పెట్టకుండా.. ఎవరి పని వాళ్లు చేసుకుంటే బెటర్ అని కొరటాల అన్నదెవరిని..? వీటన్నింటికీ ఆన్సర్ వచ్చేసిందిప్పుడు. ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ..
Updated on: Sep 30, 2024 | 8:43 AM

ఒక్క ఫ్లాప్‌తో దర్శకుడు, హీరో మధ్య ఉన్న రిలేషన్ చెడిపోతుందనుకోవడం అవివేకమే అవుతుంది. ఎందుకంటే చాలా సార్లు ఫ్లాపిచ్చిన దర్శకులతోనే హిట్లు కొడుతుంటారు హీరోలు. నాని సరిపోదా శనివారం అలా వచ్చిందే. అయితే ఆచార్య ఫ్లాప్ చిరంజీవి, కొరటాల మధ్య దూరం పెంచిందనే వార్తలొచ్చాయి.వాటిపై స్వయంగా కొరటాలే స్పందించారిప్పుడు.

తాజాగా దేవర సినిమా బ్లాక్ బస్టర్‌తో ఫుల్ ఖుషిగా ఉన్నారు కొరటాల శివ.సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ క్యాన్సిల్ అవ్వడంతో చాలా ప్రశ్నలు అలాగే ఉండిపోయాయి. పైగా తెలుగు మీడియాతోనూ మాట్లాడలేదు. ఇప్పుడా సమయం వచ్చింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవితో తనకున్న రిలేషన్ గురించి ఓపెన్ అయ్యారు ఈ దర్శకుడు.

ఆచార్య తర్వాత కొన్ని ఈవెంట్స్‌లో దర్శకులపై సీరియస్ కామెంట్స్ చేసారు చిరు. వర్క్ షాప్ చేయరని.. ఖర్చు పెంచేస్తున్నారని.. కథపై క్లారిటీ ఉండదన్నారు. పైగా ఆచార్య పూర్తిగా కొరటాల ఛాయిస్ అని.. ఆయనేం చెప్తే అదే మేం చేసామన్నారు చిరు.

ఇదిలా ఉంటే.. పక్కోడి పనుల్లో వేలు పెట్టకుండా.. ఎవరి పని వాళ్లు చేస్తే బెటర్ అన్నారు కొరటాల ఈ మధ్యే. ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.కొరటాల, చిరంజీవి మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని టాక్ ఉన్న నేపథ్యంలో కొరటాల కామెంట్స్ నిప్పు రాజేసాయి.

అయితే తమ మధ్య అంతా బానే ఉందని.. ఆచార్య విడుదలైన రెండో రోజే చిరు దగ్గర్నుంచి ‘నువ్వు స్ట్రాంగ్‌గా బౌన్స్ బ్యాక్ అవుతాయ్ శివ’ అని మెసేజ్ వచ్చిందన్నారు కొరటాల. మొత్తానికి ఈ వివాదానికి కొరటాల క్లారిటీతో ఫుల్ స్టాప్ పడినట్లే. ఫ్యూచర్‌లో ఈ కాంబో రిపీటైతే ఫ్యాన్స్ మరింత హ్యాపీ.




