- Telugu News Photo Gallery Cinema photos Director Rajamouli Visits Allu Arjun's Pushpa 2 Movie Shooting Telugu Heroes Photos
Rajamouli-Pushpa 2: పుష్ప 2 సెట్‌లో జక్కన్న. పెద్ద ప్లానే.. అసలు మ్యాటర్ ఇదే.!
కళ్ల ముందు ఎంతటి విషయం జరిగినా.. మన మెంటాలిటీ మాత్రం నెక్స్ట్ ఏంటి? అనే ధోరణిలోనే ఉంటుంది. దేవర థియేటర్లలోకి దూసుకొచ్చిన ఈ టైమ్ లోనూ సినీ ప్రేక్షకుడి మనసు నెక్స్ట్ ఏంటి? అనే అడుగుతోంది. ఆ మాట ఇలా మెదలగానే అందరి చూపులూ పుష్ప సీక్వెల్ మీద ల్యాండ్ అవుతున్నాయి. పుష్పరాజ్.. సీక్వెల్‌లో చెలరేగిపోవడానికి సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 6న వైబ్స్ మామూలుగా ఉండవంటూ ఎప్పటికప్పుడు డిక్లేర్ చేస్తూనే ఉన్నారు మేకర్స్.
Updated on: Sep 30, 2024 | 11:27 AM

రెండు నిమిషాల 44 సెకన్ల నిడివితో ఉన్న ట్రైలర్ అలా రిలీజ్ అయిందో లేదో.. ఇలా వ్యూస్ అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ట్రైలర్‌లో ప్రతి కేరక్టర్ గురించీ మాట్లాడుకుంటున్నారు జనాలు.

ఆ మాట ఇలా మెదలగానే అందరి చూపులూ పుష్ప సీక్వెల్ మీద ల్యాండ్ అవుతున్నాయి. పుష్పరాజ్.. సీక్వెల్‌లో చెలరేగిపోవడానికి సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 6న వైబ్స్ మామూలుగా ఉండవంటూ ఎప్పటికప్పుడు డిక్లేర్ చేస్తూనే ఉన్నారు మేకర్స్.

చెప్పిన టైమ్‌కి పుష్ప సీక్వెల్ వస్తుందా? రాదా? అనే అనుమానాలు అసలు ఉండకూడదని రిపీటెడ్‌గా రిలీజ్ డేట్‌ని కన్‌ఫర్మ్ చేస్తూనే ఉన్నారు. లేటెస్ట్ గా పుష్ప సెట్స్ ని విజిట్ చేశారు జక్కన్న.

అటు సుకుమార్ ప్రాడెక్ట్ క్వాలిటీ కోసం నాన్‌స్టాప్‌గా పనిచేస్తూనే ఉన్నారు. ఇటు ఫ్యాన్స డిసెంబర్ 5 కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

ఒకవేళ ఇప్పటిదాకా ఉన్నా లేకున్నా, మేం అంటూ దిగాక అన్నీ సాధ్యపడాల్సిందేనని ట్రెండ్ చేస్తోంది అల్లు ఆర్మీ. పుష్ప2 ఇప్పుడు నేషనల్ లెవల్లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

రెండు యూనిట్లతో షూటింగ్ స్పీడు పెంచారు కెప్టెన్ సుకుమార్. రామోజీ ఫిల్మ్ సిటీలో బన్నీతో ఓ షూటింగ్ జరుగుతోంది. కాకినాడ పరిసరాల్లో మరికొన్ని సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు.

ఈ నెలాఖరుకు టాకీ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. ఆల్రెడీ రెండు పాటల్ని విడుదల చేశారు. ఇంకో రెండు పాటలను తెరకెక్కించాలి. వాటిలో ఒకటి స్పెషల్ సాంగ్.




