Urmila: ఊర్మిళ ఈజ్ బ్యాక్.! మళ్లీ వెండితెరపై మెరిసిపోనున్న హీరోయిన్.
మన దగ్గర చేసింది కొన్ని సినిమాలే అయినా, ఒక్క పాటతోనో, ఒకే ఒక్క సినిమాతోనో గుర్తుండిపోయిన నాయికలు చాలా మందే ఉంటారు. అలా పేరు చెప్పగానే చటుక్కున గుర్తొచ్చే నిన్నటి తరం నాయికల్లో ఊర్మిళ ఉంటారు. యాయిరే యాయిరే అంటూ ఇప్పటికే ఊర్మిళను హ్యాపీగా అనుకుంటుంటారు మన వారు.. ఊర్మిళ మన దగ్గర సినిమాలు చేసి చాలా కాలమైంది. నార్త్ లోనే సెటిల్ అయిన ఈ లేడీ పెళ్లి చేసుకున్నాక, ఫ్యామిలీ లైఫ్‌కీ, టీవీ షోలకీ పరిమితమయ్యారు.