Tollywood: ఈ నటిని గుర్తు పట్టారా? సీనియర్ హీరోయిన్ కూతురు.. డబ్బుల్లేక సబ్బులు అమ్మి..

పై ఫొటోలో ఉన్న నటిని గుర్తు పట్టారా? ఈమె ఒక్కప్పటి స్టార్ నటి కూతురు. తల్లి అడుగుజాడల్లోనే నడుస్తూ తను కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మోహన్ లాల్, సూర్య తదితరుల స్టార్ హీరోలతో కలిసి నటించింది. తెలుగులోనూ పేరున్న హీరోల సినిమాల్లో చేసింది. తన అందం, అభినయంతో స్టార్ స్టేటస్ ను అనుభవించింది

Tollywood: ఈ నటిని గుర్తు పట్టారా? సీనియర్ హీరోయిన్ కూతురు.. డబ్బుల్లేక సబ్బులు అమ్మి..
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Sep 23, 2024 | 9:33 PM

పై ఫొటోలో ఉన్న నటిని గుర్తు పట్టారా? ఈమె ఒక్కప్పటి స్టార్ నటి కూతురు. తల్లి అడుగుజాడల్లోనే నడుస్తూ తను కూడా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. మోహన్ లాల్, సూర్య తదితరుల స్టార్ హీరోలతో కలిసి నటించింది. తెలుగులోనూ పేరున్న హీరోల సినిమాల్లో చేసింది. తన అందం, అభినయంతో స్టార్ స్టేటస్ ను అనుభవించింది. అయితే విధి ఆమెను చిన్న చూపు చూసింది. భర్తతో విడాకులు, సినిమా అవకాశాలు సన్నగిల్లిపోవడంతో కష్టాలు ఈ అందాల తారను చుట్టుముట్టాయి. పిల్లలను పోషించలేని దీన స్థితికి చేరుకుంది. చివరకు డబ్బు ల కోసం ఇంటింటికీ తిరిగి సబ్బులు అమ్ముకుంది. మంచిగా డబ్బులు వస్తే పాచి పని అయినా చేస్తానంటూ ఆ మధ్యన తన దీన స్థితిని చెప్పుకుని వాపోయిందీ అందాల తార. అయితే చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలా దర్శనమిచ్చింది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టులో ఈ సీనియర్ నటి నటిస్తోంది. తాజాగా సినిమాలో ఆమె పాత్రను రివీల్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఎంతో భయానకంగా కనిపించి ఆశ్చర్యానికి గురి చేసిందీ ముద్దుగుమ్మ. మరీ ఈ నటి ఎవరో తెలుసా? తన మరెవరో కాదు అలనాటి అందాల తార లక్ష్మీ కూతురు, ప్రముఖ నటి ఐశ్వర్య.

ఇవి కూడా చదవండి

చాలా రోజుల తర్వాత ఓ భారీ ప్రాజెక్టులో అవకాశం దక్కించుకుంది నటి ఐశ్వర్య. మంచు విష్ణు హీరోగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న కన్నప్ప సినిమాలో ఐశ్వర్య కీలక పాత్ర పోషిస్తోంది. సోమవారం (సెప్టెంబర్ 23) కన్నప్ప నుంచి మారెమ్మ పాత్రకు సంబంధించిన లుక్‌ విడుదల చేశారు. నటి ఐశ్వర్య ఈ మారెమ్మ లుక్‌లో అందరినీ భయపెట్టేలా ఉంది. అడవిని పీడించే అరాచకం మారెమ్మ.. కుతంత్రమే ఆమె మంత్రం అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

కన్నప్ప సినిమాలో ఐశ్వర్య లుక్..

ఆ మధ్యన సినిమా అవకాశాల్లేక పొట్ట కూటి కోసం ఇంటింటికి తిరుగుతూ సబ్బులు అమ్ముకుంటున్నానంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఐశ్వర్య.

నటి ఐశ్వర్య లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.