AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mathu Vadalara 2 OTT: అప్పుడే ఓటీటీలోకి మత్తు వదలరా 2.. సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

ఎమ్ ఎమ్ కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి, కమెడియన్ సత్య లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం మత్తు వదలరా 2. 2019లో సైలెంట్ గా రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన మత్తు వదలరా ఇదికి సీక్వెల్. రితేష్ రానా తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ లో జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా కీలక పాత్ర పోషించింది

Mathu Vadalara 2 OTT: అప్పుడే ఓటీటీలోకి మత్తు వదలరా 2.. సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Mathu Vadalara 2 Movie,
Basha Shek
|

Updated on: Oct 10, 2024 | 8:34 AM

Share

ఎమ్ ఎమ్ కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి, కమెడియన్ సత్య లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం మత్తు వదలరా 2. 2019లో సైలెంట్ గా రిలీజై సూపర్ హిట్ గా నిలిచిన మత్తు వదలరా ఇదికి సీక్వెల్. రితేష్ రానా తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ లో జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా కీలక పాత్ర పోషించింది. అలాగే వెన్నెల కిశోర్, సునీల్, అజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. టీజర్స్, ట్రైలర్ తోనే ఆసక్తిరేకెత్తించిన మత్తు వదలరా 2 సెప్టెంబర్ 13న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. సినిమా చూసిన వారందరూ కడుపుబ్బా నవ్వుకున్నామంటున్నారు. ముఖ్యంగా సత్య కామెడీ అదిరిపోయిందని, అలాగే వెన్నెల కిశోర్, ఫరియా అబ్దుల్లా, సునీల్, అజయ్ స్క్రీన్ ప్రజన్స్ చాలా అట్రాక్ట్ చేసిందని, యాక్షన్ సీక్వెన్స్ కూడా బాగున్నాయని రివ్యూలు వచ్చాయి. ఇప్పటికీ థియేటర్లలో ఆడియెన్స్ ను నవ్విస్తోన్న మత్తు వదలరా 2 సినిమా ఓటీటీ రిలీజ్ గురించి చాలా మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మత్తు వదలరా 2 ఓటీటీ రైట్స్ కోసం భారీగానే డిజిటల్ సంస్థలు పోటీ పడిటనట్లు సమాచారం. అయితే ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సూపర్ హిట్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇందుకోసం ఓటీటీ సంస్థ, మూవీ మేకర్స్ మధ్య భారీ డీల్ జరిగందని టాక్ నడుస్తోంది.

థియేట్రికల్ రిలీజ్ నాలుగు వారాల తర్వాతే మత్తు వదలరా 2 సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేలా నెట్‌ ఫ్లిక్స్, మూవీ మేకర్స అగ్రిమెంట కుదుర్చుకున్నారట. అంటే ఈ లెక్కన మత్తు వదలరా 2 అక్టోబర్ రెండో వారం లేదా మూడో వారంలో ఓటీటీ రిలీజ్‌కు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై చిరంజీవి పెద్దమల్లు, హేమలత పెద్దమల్లు ఈ సినిమాను సంయక్తంగా నిర్మించారు. ఈ సినిమా ఇప్పటివరకు సుమారు 12 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు.

మత్తు వదలరా 2 ట్రైలర్..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..