AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Preeti Jhangiani: టాలీవుడ్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఐసీయూలో చికిత్స.. డాక్టర్లు ఏమంటున్నారంటే?

ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింగ్యానీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త, ప్రముఖ నటుడు పర్వీన్ దబాస్ ప్రమాదానికి గురయ్యారు. శనివారం (సెప్టెంబర్ 21) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పర్వీన్ దబాస్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు

Preeti Jhangiani: టాలీవుడ్ హీరోయిన్ భర్తకు ప్రమాదం.. ఐసీయూలో చికిత్స.. డాక్టర్లు ఏమంటున్నారంటే?
Preeti Jhangiani Family
Basha Shek
|

Updated on: Sep 21, 2024 | 2:43 PM

Share

ప్రముఖ బాలీవుడ్ నటి ప్రీతి జింగ్యానీ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె భర్త, ప్రముఖ నటుడు పర్వీన్ దబాస్ ప్రమాదానికి గురయ్యారు. శనివారం (సెప్టెంబర్ 21) ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పర్వీన్ దబాస్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. పర్వీన్ దాబాస్ స్వయంగా కారు నడుపుతున్నాడని, అయితే ప్రమాదానికి సరైన కారణాలు తెలియడం లేదని తెలుస్తోంది.  కాగా ప్రస్తుతం పర్వీన్ బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. పర్వీన్ కార్ యాక్సిడెంట్ తో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈనేపథ్యంలో కార్ యాక్సిడెంట్ కు సంబంధించి ప్రీతి ఫ్యామిలీ ఒక ప్రకటన కూడా వెలువరించింది. ఈ క్లిష్ట సమయంలో తమ గోప్యతకు ప్రాధాన్యమివ్వవాలని అందులో కోరింది. ‘ప్రో పంజా లీగ్ సహ వ్యవస్థాపకుడు పర్వీన్ దాబాస్ శనివారం ఉదయం దురదృష్టవశాత్తు కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన బాంద్రాలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్‌లో ICUలో చికిత్స పొందుతున్నారు’ అని ప్రకటనలో తెలిపింది ప్రీతి ఫ్యామిలీ.

ప్రమాదంపై నటి ప్రీతి కూడా స్పందించింది. ‘ ప్రస్తుతం నా కుటుంబమంతా షాక్‌లో ఉంది. ఏం మాట్లాడలేకపోతున్నాం. తెల్లవారుజామున నా భర్తకి కారు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగోలేదని డాక్టర్స్ చెప్పారు. వైద్య పరీక్షలు చేస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేసింది ప్రీతి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘తమ్ముడు’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది ప్రీతి జింగానియా. అందులో జానకిగా అద్భుతంగా నటించింది. ఆ తర్వాత బాలకృష్ణతో ‘నరసింహనాయుడు’, మోహనబాబుతో ‘అధిపతి’, రాజేంద్ర ప్రసాద్ ‘అప్పారావు డ్రైవింగ్ స్కూల్’ సినిమాల్లో నటించింది. ఇక ఎన్టీఆర్ ‘యమదొంగ’లో ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించింది. చివరిగా అల్లరి నరేష్ విశాఖ ఎక్స్ ప్రెస్ లో నటించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లిపోయి అక్కడే సెటిలైపోయింది.

ఇవి కూడా చదవండి

వినాయక చవితి ఉత్సవాల్లో ప్రీతి జింగానియా దంపతులు..

సినిమాల సంగతి పక్కన పెడితే.. 2008లో నటుడు, మోడల్ పర్వీన్ దబాస్‌ని పెళ్లి చేసుకుంది ప్రీతి జింగానియా. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పర్వీన్ కూడా హిందీలో ‘మాన్‌సూన్ వెడ్డింగ్’, ‘ఖోస్లా కా ఘోస్లా’, ‘రాగిణి ఎమ్ఎమ్ఎస్ 2’ తదితర సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది ‘శర్మజీ కీ భేటీ’ చిత్రంలో కనిపించాడు.

భర్తతో ప్రీతి జింగానియా..

View this post on Instagram

A post shared by Parvin Dabas (@dabasparvin)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.