Thangalaan: బ్లాక్ బస్టర్ మూవీ తంగలాన్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? అసలు ఊహించలేరు

చియాన్ విక్రమ్ హీరోగా ఇటీవల విడుదలైన 'తంగళన్' చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. పా రంజిత్ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ అడ్వెంచెరస్ థ్రిల్లర్ లో పార్వతి తిరువొత్తు, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజైన తంగలాన్ కు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది.

Thangalaan: బ్లాక్ బస్టర్ మూవీ తంగలాన్ ను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా? అసలు ఊహించలేరు
Thangalaan Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 19, 2024 | 3:34 PM

చియాన్ విక్రమ్ హీరోగా ఇటీవల విడుదలైన ‘తంగళన్’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. పా రంజిత్ తెరకెక్కించిన ఈ పీరియాడికల్ అడ్వెంచెరస్ థ్రిల్లర్ లో పార్వతి తిరువొత్తు, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించారు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న తెలుగు, తమిళంలో ఒకేసారి రిలీజైన తంగలాన్ కు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. రెండు చోట్లా పాజిటివ్ టాక్ వచ్చింది. తమిళంలో తంగలాన్ ఈ సినిమా 100 కోట్లకు పైగానే వసూళ్లు రాబట్టింది. కర్ణాటకలోని కోలార్ బంగారు గని నేపథ్యంలో తంగలాన్ సినిమా తెరకెక్కింది. ఇందులో ఆర్తి అనే కీలక పాత్రలో మాళవిక మోహనన్ అద్భుతంగా నటించింది. అయితే మొదట ఈ సినిమా ఆఫర్ ఓ స్టార్ హీరోయిన్ కు వచ్చింది. కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో మాళవిక మోహన్ దగ్గరకు వెళ్లింది. అలా తంగలాన్ లాంటి సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్న నటి మరెవరో కాదు నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. మాళవిక మోహన్ ఆర్తి పాత్ర మొదట రష్మిక దగ్గరికే వెళ్లిందట. అయితే ఆమె అప్పటికే ఇతర చిత్రాల షూటింగ్ లో బిజీ బిజీగా ఉండడంతో నో చెప్పిందట. అప్పటికే ‘పుష్ప 2’ షూటింగ్‌ కూడా ఫుల్ స్వింగ్ లో ఉండడంతో విక్రమ్ సినిమాలో నటించేందుకు రష్మిక ఆసక్తి చూపించలేదట.

ఇవి కూడా చదవండి

కాగా దక్షిణాదితో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తోంది రష్మిక మందన్నా. అయితే ఇతర భాషలతో పోలిస్తే తమిళంలో రష్మిక మందన్న సినిమాలు తక్కువే అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె అక్కడ ధనుష్‌ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. గతంలో విజయ్‌తో కలిసి ‘వారిసు’ సినిమాలో మాత్రమే నటించింది. ఇక రష్మిక మందన్నప్రస్తుతం ‘పుష్ప 2’తో పాటు పలు సినిమాల్లో నటిస్తోంది. హిందీ చిత్రం ‘ఛవ్వా’ తో పాటు పుష్ప 2 కూడా డిసెంబర్ 6న విడుదల కానుండడం గమనార్హం. కాగా థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన తంగలాన్ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వస్తోంది.

రష్మిక వద్దని చెప్పడంతో మాళవిక దగ్గరకు..

తంగలాన్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.