AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kumari Aunty: మంచి మనసు చాటుకున్న కుమారీ ఆంటీ.. వరద బాధితులకు విరాళం.. ఎంతంటే?

ముంపు బాధితులను ఆదుకునేందుకు రెండు ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. తాజాగా కుమారి అంటీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు విరాళం అందజేశారు. బుధవారం (సెప్టెంబర్ 18) కుమారీ ఆంటీ తన కుమార్తెతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డికి..

Kumari Aunty: మంచి మనసు చాటుకున్న కుమారీ ఆంటీ.. వరద బాధితులకు విరాళం.. ఎంతంటే?
Kumari Aunty, CM Revanth Reddy
Basha Shek
|

Updated on: Sep 18, 2024 | 5:15 PM

Share

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని విజయవాడ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఈ నేపథ్యంలో ముంపు బాధితులను ఆదుకునేందుకు రెండు ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. అలాగే వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. తాజాగా కుమారి అంటీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50వేలు విరాళం అందజేశారు. బుధవారం (సెప్టెంబర్ 18) కుమారీ ఆంటీ తన కుమార్తెతో కలిసి సీఎం రేవంత్‌ రెడ్డికి రూ.50 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కుమారీ ఆంటీని ఘనంగా సన్మానించారు. ఆమెకు శాలువా కప్పి ధన్యవాదాలు తెలిపారు. కాగా కొన్ని నెలల క్రితం ట్రాఫిక్ క్లియరెన్స్ లో భాగంగా కుమారీ ఆంటీ ఫుడ్ స్టాల్ ను పోలీసులు తొలగించారు. దీంతో ఆమె హోటల్ బిజినెస్ బాగా దెబ్బతింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని మరీ కుమారీ ఆంటీ ఫుడ్ హోటల్ ను ఓపెన్ చేయించారు.

కుమారి ఆంటీ పూర్తి పేరు దాసరి సాయి కుమారి. హైదరాబాద్‌లోని ఇనార్బిట్ మాల్ సమీపంలో రోడ్ సైడ్ మీల్స్ బిజినెస్ చేస్తోన్న ఆమె పేరు గత కొన్ని రోజులుగా బాగా వినిపిస్తోంది. ‘మీది రూ.1000 అయింది..రెండు లివర్లు ఎక్స్ట్రా అంటూ కుమారీ ఆంటీ చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాలో బాగా వైరలైపోయాయి. దీంతో ఆమె ఫుడ్ స్టాల్ ముందు జనం క్యూ కట్టారు. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తి, పోలీసులు రంగ ప్రవేశం చేసి కుమారీ ఆంటీ హోటల్ ను క్లోజ్ చేయించాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

కుమారీ ఆంటీని సన్మానిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి..

అయితే సీఎం రేవంత్ రెడ్డి జోక్యంతో మళ్లీ ఆమె బిజినెస్ ఓపెన్ అయ్యింది. దీని తర్వాత కుమారీ ఆంటీ పేరు బాగా మార్మోగిపోయింది. పలు టీవీ షోల్లోనూ సందడి చేసిందామె. అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ గానూ వస్తుందని ప్రచారం జరిగింది. అయితే అదేమీ జరగలేదు.

రేవంత్ రెడ్డికి చెక్కు అందజేస్తోన్న కుమారీ ఆంటీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇంట్లో ఫ్యాన్ మెల్లగా తిరుగుతుందా.. ఇలా చేస్తే జెట్ స్పీడ్‌తో..
ఇంట్లో ఫ్యాన్ మెల్లగా తిరుగుతుందా.. ఇలా చేస్తే జెట్ స్పీడ్‌తో..
ఈ మొక్క లక్ష్మీదేవికి ప్రతీక.. ఇంట్లో నాటితే సంపద, ఐశ్వర్యం...
ఈ మొక్క లక్ష్మీదేవికి ప్రతీక.. ఇంట్లో నాటితే సంపద, ఐశ్వర్యం...
యువరాజ్ సింగ్, గార్ఫీల్డ్ సోబర్స్.. సేమ్ టూ సేమ్!
యువరాజ్ సింగ్, గార్ఫీల్డ్ సోబర్స్.. సేమ్ టూ సేమ్!
చేపలు ఆరోగ్యానికి మంచివే.. కానీ వీళ్లు మాత్రం అస్సలు తినకూడదు..!
చేపలు ఆరోగ్యానికి మంచివే.. కానీ వీళ్లు మాత్రం అస్సలు తినకూడదు..!
నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో చూడొచ్చంటే?
నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీస్.. ఏయే ఓటీటీల్లో చూడొచ్చంటే?
నల్ల బ్యాడ్జీలతో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?
నల్ల బ్యాడ్జీలతో భారత్, ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. కారణం ఏంటంటే?
కిచెన్, బాత్రూం పక్కపక్కనే ఉన్నాయా..? వాస్తు ప్రకారం ఈ తప్పులు..
కిచెన్, బాత్రూం పక్కపక్కనే ఉన్నాయా..? వాస్తు ప్రకారం ఈ తప్పులు..
బుడ్డి గ్లాసెడు తాగితే.. 102 జ్వరంతో మండిపోతోన్న ఒళ్ళు కూడాచల్లగా
బుడ్డి గ్లాసెడు తాగితే.. 102 జ్వరంతో మండిపోతోన్న ఒళ్ళు కూడాచల్లగా
పైసా ఖర్చు లేకుండా నల్లటి గ్యాస్ స్టవ్ బర్నర్‌లను కొత్తవాటిలా..
పైసా ఖర్చు లేకుండా నల్లటి గ్యాస్ స్టవ్ బర్నర్‌లను కొత్తవాటిలా..
Astrology: స్నేహం కోసం ప్రాణం పెట్టే 4 రాశులు ఇవే.. మీ రాశి ఈ..
Astrology: స్నేహం కోసం ప్రాణం పెట్టే 4 రాశులు ఇవే.. మీ రాశి ఈ..