Siddharth – Aditi Rao: కొత్త జంట సిద్ధార్థ్, అదితీ రావుల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా? ఊహించలేరు..

టాలీవుడ్ ప్రేమ పక్షులు సిద్ధార్థ్, అదితి రావు తమ జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టారు. తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. సోమవారం సిద్ధార్థ్, అదితిల వివాహం సింపుల్ గా జరిగింది. నపర్తిలోని శ్రీ రంగనాయక స్వామీ దేవాలయం వేదికగా ఇరు కుటుంబాలు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్, అదితీ పెళ్లి చేసుకున్నారు.

Siddharth - Aditi Rao: కొత్త జంట సిద్ధార్థ్, అదితీ రావుల మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా? ఊహించలేరు..
Aditi Rao Hydari, Siddharth
Follow us
Basha Shek

|

Updated on: Sep 17, 2024 | 5:54 PM

టాలీవుడ్ ప్రేమ పక్షులు సిద్ధార్థ్, అదితి రావు తమ జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టారు. తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. సోమవారం సిద్ధార్థ్, అదితిల వివాహం సింపుల్ గా జరిగింది. నపర్తిలోని శ్రీ రంగనాయక స్వామీ దేవాలయం వేదికగా ఇరు కుటుంబాలు, అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సిద్ధార్థ్, అదితీ పెళ్లి చేసుకున్నారు. అనంతరం తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి మురిసిపోయారు. ‘నా సూర్యుడు నువ్వే.. నా చంద్రుడు నువ్వే. నా నక్షత్ర లోకం కూడా నవ్వే. శాశ్వతంగా మనిద్దరం సోల్ మేట్స్ గా ఉండటానికి.. నవ్వడానికి.. జీవించేందుకు తోడుగా ఉండాలి. మిసెస్ అండ్ మిస్టర్ అదు సిద్ధూ’ అంటూ భర్తపై ప్రేమను కురిపించింది అదితీ రావు హైదరీ. ప్రస్తుతం వీరి పెళ్లి ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతుండగా.. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా సిద్ధార్థ్, అదితీ రావు కలిసి మహా సముద్రం సినిమాలో నటించారు. ఆ సినిమా షూటింగులో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో ఈ ఏడాది ప్రారంభంలో ఇదే ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక ఇప్పుడు తమ ప్రేమ బంధాన్ని మూడు ముళ్ల బంధంగా మార్చుకున్నారు.

కాగా అదితి రావు హైదరీ, సిద్ధార్థ్ ఇద్దరికి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది. సిద్ధార్థ్ దక్షిణాదిలో నటుడిగా సత్తా చాటుతుంటే, అదితీ రావు హైదరీ సౌత్ తో పాటు బాలీవుడ్ లోనూ హవా కొనసాగిస్తోంది. కాగా సినిమాల్లో సక్సెస్ అయిన సిద్ధార్థ్, అదితీ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎదురు దెబ్బలు తిన్నాడు. వీరిద్దరికి ఇదివరకే వివాహమై విడాకులు తీసుకున్నారు. అదితి సత్యదీప్ మిశ్రా అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత వీరిద్దరు విడిపోయారు. సిద్ధార్థ్ సైతం మొదట మేఘనా నారాయణ్‌ను పెళ్లాడాడు. అయితే 2007లోనే ఆమెతో విడాకులు తీసుకున్నాడు.

ఇవి కూడా చదవండి

సిద్ధార్థ్, అదితీల పెళ్లి ఫొటోస్..

సిద్ధార్థ్, అదితీల పెళ్లైపోవడంతో వీరిద్దరి గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ముఖ్యంగా ఈ కొత్త జంటకు ఏజ్‌ గ్యాప్‌ ఎంత ఉందన్న విషయంపై ఆరా తీస్తున్నారు. అదితి రావు హైదరి అక్టోబర్ 28న 1986న ఆంధ్రప్రదేశ్‌లోని హైదరాబాద్‌లో జన్మించింది. ప్రస్తుతం ఆమె వయస్సు 37 సంవత్సరాలు. మరోవైపు హీరో సిద్దార్థ్ 1979 ఏప్రిల్ 17న చెన్నైలో జన్మించారు. సుమారు 44 ఏళ్లు. అంటే వీరిద్దరి మధ్య దాదాపు 7 సంవత్సరాల వయస్సు తేడా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.