AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devara- Jr NTR: దేవర కోసం ఎన్టీఆర్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లో తెలుసా?

దేవర.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది

Devara- Jr NTR: దేవర కోసం ఎన్టీఆర్ కళ్లు చెదిరే రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లో తెలుసా?
Devara Movie
Basha Shek
|

Updated on: Sep 16, 2024 | 1:15 PM

Share

దేవర.. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా పేరే వినిపిస్తోంది. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా విడుదల కాబోతున్న ఈ చిత్రం కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ తెరకెక్కించిన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా కనిపించాడు. ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్ దేవర పై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక దేవరకు సంబంధించిన ఈ విషయమైనా సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.తాజాగా దేవర సినిమాకు గాను యంగ్ టైగర్ అందుకున్న రెమ్యునరేషన్ గురించి ఓ వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా రూ. 60 కోట్ల పారితోషకం తీసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. గతంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాకు తారక్ రూ. 45 కోట్లు తీసుకున్నట్లు టాక్. అయితే దేవర సినిమాకు వచ్చేసరికి తన పారితోషకాన్ని భారీగా పెంచేశారట ఎన్టీఆర్. ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఈ న్యూస్ బాగా వైరలవుతోంది.

ఇవి కూడా చదవండి

కాగా దేవర సినిమాలో మిగతా ఆర్టిస్టులు కూడా భారీగానే రెమ్యునరేషన్లు తీసుకున్నారట. ఈ సినిమాతోనే టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ రూ. 5 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీఖాన్ రూ. 10 కోట్లు, ప్రకాశ్ రాజ్ రూ. 1.5 కోట్లు అందుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా దేవర సినిమాను నిర్మించాయి. అనిరుధ్ రవిచందర్ అందించిన స్వరాలు ఇప్పటికే సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. ఇక ప్రమోషన్లు కూడా ఓ రేంజ్ లో ఉంటున్నాయి. ఇప్పటికే నార్త్ లో ప్రమోషన్స్ పూర్తి చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగు నాట వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా, విశ్వక్ సేన్, సిద్దూ జొన్నల గడ్డలతో ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు.

సందీప్ రెడ్డి వంగాతో దేవర టీమ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us