Megha Akash: ‘నా ఫేవరెట్ ఛాప్టర్’.. పెళ్లిపీటలెక్కిన మేఘా ఆకాశ్‌.. హాజరైన సీఎం స్టాలిన్.. ఫొటోస్ వైరల్

టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్ మేఘా ఆకాశ్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. సాయి విష్ణుతో కలిసి ఏడడుగులు నడిచింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టా గ్రామ్ లో షేర్ చేసిన మేఘా ఆకాశ్‌

Megha Akash: 'నా ఫేవరెట్ ఛాప్టర్'.. పెళ్లిపీటలెక్కిన మేఘా ఆకాశ్‌.. హాజరైన సీఎం స్టాలిన్.. ఫొటోస్ వైరల్
Megha Akash
Follow us
Basha Shek

|

Updated on: Sep 15, 2024 | 12:48 PM

టాలీవుడ్‌ క్రేజీ హీరోయిన్ మేఘా ఆకాశ్ తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. బ్యాచిలర్ లైఫ్ కు బై బై చెబుతూ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. సాయి విష్ణుతో కలిసి ఏడడుగులు నడిచింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. తన రిసెప్షన్‌కు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టా గ్రామ్ లో షేర్ చేసిన మేఘా ఆకాశ్‌.. ‘ఇది నా జీవితంలో ఫేవరేట్ చాప్టర్’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది. ఈ ఫొటోల్లో నూతన వధూవరులు ఎంతో అందంగా కనిపించారు. చెన్నైలో జరిగిన మేఘా ఆకాశ్ పెళ్లి వేడుకలో పలువురు సినీ తారలతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. కొత్త దంపతులను మనసారా ఆశీర్వదించారు. ప్రస్తుతం మేఘా ఆకాశ్‌ పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు మేఘా ఆకాశ్, విష్ణు దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా చెన్నైలో జరిగిన మేఘా ఆకాశ్‌, సాయివిష్ణు ల వెడ్డింగ్ రిసెప్షన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, మంత్రి ఉదయనిధి హాజరయ్యారు. నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పలువురు డీఎంకే మంత్రులు కూడా ఈ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. గత కొన్నేళ్లుగా మేఘ, విష్ణులు లవ్ లో ఉన్నారు. అయితే గోప్యత పాటించారు. పెద్దల అనుమతితో గత నెలలో సడెన్‌గా నిశ్చితార్థం చేసుకుని తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా బయట పెట్టారు. ఎంగేమ్ మెంట్ తర్వాత పెళ్లి పనుల్లో బిజీగా మారిపోయింది మేఘ.సూపర్ స్టార్ రజినీకాంత్ తదితర సినీ ప్రముఖులకు తనే స్వయంగా వెడ్డింగ్ కార్డ్స్ ను అందజేసింది. ఇటీవలే శ్రీలంకలో తన స్నేహితులతో కలిసి గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టీ కూడా చేసుకుంది. తెలుగులో ‘లై’తో పాటు ఛల్ మోహన్ రంగ, రాజరాజ చోర, గుర్తుందా శీతాకాలం, ప్రేమదేశం, రావణాసుర, బూ తదితర చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులోనే రెండు మూవీస్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మేఘా ఆకాశ్ వెడ్డింగ్ రిసెప్షన్ వేడుకల్లో  తమిళనాడు సీఎం స్టాలిన్..

నా జీవితంలో ఫేవరెట్ ఛాప్టర్..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Megha Akash (@meghaakash) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి