AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devayani: సుస్వాగతం హీరోయిన్ దేవయాని కూతుళ్లను చూశారా? అమ్మ అందమే ఈ అమ్మాయిలకూ వచ్చింది

సీనియర్ నటి దేవయాని అంటే చాలా మంది గుర్తుకురాకపోవచ్చు. కానీ పవన్ కల్యాణ్ సుస్వాగతం హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుకు వస్తుంది. సుమారు పాతికేళ్ల రిలీజైన ఈ సినిమా యూత్ ను తెగ ఆకట్టుకుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఓ రేంజ్ లో క్రేజ్ ను తెచ్చిపెట్టిందీ క్లాసిక్ లవ్ స్టోరీ. అలాగే హీరోయిన్ గా దేవయానికి కూడా బోలెడు పాపులారిటీని తెచ్చిపెట్టింది.

Devayani: సుస్వాగతం హీరోయిన్ దేవయాని కూతుళ్లను చూశారా? అమ్మ అందమే ఈ అమ్మాయిలకూ వచ్చింది
Devayani
Basha Shek
|

Updated on: Sep 14, 2024 | 8:09 PM

Share

సీనియర్ నటి దేవయాని అంటే చాలా మంది గుర్తుకురాకపోవచ్చు. కానీ పవన్ కల్యాణ్ సుస్వాగతం హీరోయిన్ అంటే ఠక్కున గుర్తుకు వస్తుంది. సుమారు పాతికేళ్ల రిలీజైన ఈ సినిమా యూత్ ను తెగ ఆకట్టుకుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఓ రేంజ్ లో క్రేజ్ ను తెచ్చిపెట్టిందీ క్లాసిక్ లవ్ స్టోరీ. అలాగే హీరోయిన్ గా దేవయానికి కూడా బోలెడు పాపులారిటీని తెచ్చిపెట్టింది. ఇందులో సంధ్య అనే మిడిల్ క్లాస్ అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది దేవయాని. ఓ వైపు తండ్రి ప్రకాశ్ రాజ్ కు భయపడే కూతురుగా.. మరోవైపు ఇష్టంలేకున్నా పవన్ కళ్యాణ్‌ను దూరం పెట్టి నరకం అనుభవించే అమ్మాయిగా దేవయాని నటన ప్రశంసలు అందుకుంది. ఈమెకు తొలి తెలుగు సినిమా ఇదే కావడం గమనార్హం. సుస్వాగతం తర్వాత శ్రీకాంత్‌తో మాణిక్యం, జగపతిబాబుతో శ్రీమతి వెళ్లొస్తా తదితర తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. కోలీవుడ్‌లోనూ అజిత్ కుమార్, శరత్‌కుమార్‌ వంటి స్టార్‌ హీరోలతో స్క్రీన్‌ షేర్ చేసుకుంది. అయితే హీరోయిన్ గా మాత్రం కంటిన్యూ గా సినిమాలు చేయలేకపోయింది.

ఇవి కూడా చదవండి

చెన్నకేశవ రెడ్డి సినిమాలో బాలకృష్ణ చెల్లెలిగా నటించిన దేవయాని, నానిలో మహేష్ బాబు అమ్మగా, జనతా గ్యారేజ్‌లో మోహన్ లాల్ భార్యగా, అరవింద సమేతలో జూనియర్ ఎన్టీఆర్ తల్లిగా, లవ్ స్టోరీ సినిమాలో సాయి పల్లవి తల్లిగా చాలా తెలుగు సినిమాల్లోనే నటించి మెప్పించారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. తమిళ్‌ ఇండస్ట్రీకి చెందిన డైరెక్టర్‌ రాజకుమారన్‌ను ప్రేమ వివాహం చేసుకుంది దేవయాని. 2001లో వీరి వివాహం జరిగింది. వీరి దాంపత్య బంధానికి ప్రతీకగా ఇనియా, ప్రియాంక అని ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

కుటుంబ సభ్యులతో నటి దేవయాని..

సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటే దేవయాని అప్పుడప్పుడు తన కూతుళ్ల ఫొటోలను అందులో షేర్ చేసుకుంటుంది. వీటిని చూసి’ అమ్మ అందమే పిల్లలకు వచ్చింది, చాలా క్యూట్ గా ఉన్నారు’ అంటూ క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం దేవయాని.. జయం రవి హీరోగా నటిస్తున్న జెనీ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఓ స్కూల్ లోనూ టీచర్ గా పనిచేస్తోంది.

కూతురితో కలిసి ఓ ఇంట్వ్యూలో దేవయాని..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us