Tollywood: ఈ కుర్రాడిని గుర్తు పట్టారా? అమెరికాలో జాబ్ మానేసి సినిమాల్లోకి.. టాలీవుడ్ హీరో కమ్ డైరెక్టర్
అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసిన ఈ అబ్బాయి అక్కడే మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు. లక్షల జీతం. కానీ సినిమాలపై మక్కువతో మళ్లీ ఇండియాకు వచ్చేశాడు. నటుడిగా అదృష్టం పరీక్షించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత సోలో హీరోగానూ మెప్పించాడు.
పై ఫొటోలో గుర్రంపై సవారీ చేస్తోన్న కుర్రాడిని గుర్తు పట్టారా? ఈ అబ్బాయి టాలీవుడ్ లో బాగా ఫేమస్. కేవలం నటుడిగానే కాకుండా రైటర్ గానూ, డైరెక్టర్ గానూ సత్తా చాటుతున్నాడు. అంతే కాదు హోస్ట్ గా బుల్లితెరపై కూడా మెరుస్తున్నాడు. ఇక డబ్బింగ్ ఆర్టిస్టు గానూ రాణిస్తున్నాడు. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసిన ఈ అబ్బాయి అక్కడే మంచి ఉద్యోగం కూడా సంపాదించాడు. లక్షల జీతం. కానీ సినిమాలపై మక్కువతో మళ్లీ ఇండియాకు వచ్చేశాడు. నటుడిగా అదృష్టం పరీక్షించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు. ఆ తర్వాత సోలో హీరోగానూ మెప్పించాడు. నటుడిగా రాణిస్తూనే యంగ్ హీరోలతో కలిసి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించాడు. ఇలా నటుడిగా, రైటర్ గా, డైరెక్టర్ గా రాణిస్తూ టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇతను ఈ మధ్యన పెద్దగా కనిపించడం లేదు. మరి ఈ కుర్రాడు ఎవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు అష్టాచెమ్మా సినిమాతో ఆడియెన్స్ కు గిలిగింతలు పెట్టిన అవసరాల శ్రీనివాస్. ఇది అతని టీనేజ్ ఫొటో. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ప్రాంతానికి చెందిన అవసరాల శ్రీనివాస్ విజయవాడలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఎంఎస్ చేసేందుకు యూఎస్ వెళ్లాడు. అక్కడే మంచి హార్డ్ వేర్ జాబ్ కూడా సాధించుకున్నాడు. కానీ సినిమాలపై ఇంట్రెస్టుతో మళ్లీ ఇండియాకు వచ్చేశాడు.
అష్టాచమ్మ సినిమాతో ఎంట్రీ ఇచ్చారుఅవసరాల శ్రీనివాస్. ఆ తర్వాత పలు సినిమాల్లోనూ సెకెండ్ హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించి మెప్పించారు. పలు సినిమాలకు రైటర్ గానూ వ్యవహరించారు. మెగా ఫోన్ పట్టుకుని ‘ఊహలు గుసగులాడే’ , ‘జోఅచ్యుతానంద’ వంటి ఫీల్ గుడ్ సినిమాలను తెరకెక్కించారు. కాగా తెలుగు సినిమాల్లో ఏ చిన్న రోల్ అయినా కూడా కాదనకుండా చేస్తూ.. తన కామెడీ టైమింగ్‌తో కడుపుబ్బా నవ్వించడం అవసరాల శ్రీనివాస్ ప్రత్యేకత. అందుకే ఈ ట్యాలెంటెడ్ యాక్టర్ కు టాలీవుడ్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. బ్రహ్మాస్ర్త వంటి హిందీ సినిమాలు, అవతార్ వంటి హాలీవుడ్ సినిమాలకు తెలుగు డబ్బింగ్ కూడా చెప్పాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. గతేడాది నాగ శౌర్యతో కలిసి అతను తీసిన ఫలానా అమ్మాయి ఫలానా అబ్బాయి మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.