Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: విలాసవంతమైన కార్లు.. 22 లక్షల విలువైన బూట్లు.. 2 నైట్‌క్లబ్‌లు.. ఈ సింగర్ లైఫ్ స్టైల్ చూస్తే..

అప్పటి నుంచి బాద్ షా వరుసగా హిట్ పాటలు ఇస్తూనే ఉన్నాడు. భారతీయ సంగీత పరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కీర్తితో పాటు, బాద్షా తన పాటలు, కచేరీల ద్వారా చాలా సంపదను కూడా సంపాదించాడు. ప్రస్తుతం బాద్ షా ఆస్తులు, లైఫ్ స్టైల్ తెలిసి షాకవుతున్నారు ఫ్యాన్స్.

Tollywood: విలాసవంతమైన కార్లు.. 22 లక్షల విలువైన బూట్లు.. 2 నైట్‌క్లబ్‌లు.. ఈ సింగర్ లైఫ్ స్టైల్ చూస్తే..
Singer Badshah
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 12, 2024 | 9:35 PM

బాలీవుడ్ ప్రముఖ రాపర్ బాద్షా తన ర్యాపింగ్, పాటలతో ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నాడు. అతను చాలా కాలం క్రితం గాయకుడిగా కెరీర్ ప్రారంభించాడు. కానీ బాలీవుడ్‌లో ‘హంప్టీ శర్మ కి దుల్హనియా’లోని ‘శనివారం శనివారం’ పాటతో అరంగేట్రం చేశాడు. బాద్ షా పాటలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభించింది. అప్పటి నుంచి బాద్ షా వరుసగా హిట్ పాటలు ఇస్తూనే ఉన్నాడు. భారతీయ సంగీత పరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కీర్తితో పాటు, బాద్షా తన పాటలు, కచేరీల ద్వారా చాలా సంపదను కూడా సంపాదించాడు. ప్రస్తుతం బాద్ షా ఆస్తులు, లైఫ్ స్టైల్ తెలిసి షాకవుతున్నారు ఫ్యాన్స్.

బాద్ షా అసలు పేరు ఆదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియా. గెందా ఫూల్’, ‘గార్మి’, ‘లెట్స్ నాచో’, ‘డీజే వాలే బాబు’, ‘కాలా చష్మా’ వంటి ఎన్నో గొప్ప పాటలను ఇండస్ట్రీకి అందించాడు. తన చార్ట్‌బస్టర్ పాటల ద్వారా చాలా సంపాదించాడు. బాద్షా అనేక లగ్జరీ కార్లు, విలాసవంతమైన బట్టలు , బంగ్లాలను కలిగి ఉన్నాడు. అంతేకాదు బాద్ షా ధరించే షూ ఖరీదు రూ.22 లక్షలు ఉంటుందట. ఆ షూ ఎప్పుడైనా తను గ్రామీ అవార్డ్ గెలిస్తే ధరిస్తానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. బాద్షా మొత్తం ఆదాయం అతని పాటల నుండి మాత్రమే కాకుండా అతని ఆస్తులు, నైట్‌క్లబ్‌ల నుండి కూడా వస్తుంది.

ఇవి కూడా చదవండి

బాద్షా వద్ద 8 వాహనాలు ఉన్నాయి. రోల్స్ రాయిస్, దీని విలువ 6.4 కోట్లు, 3.06 కోట్ల విలువైన లంబోర్గినీ గల్లార్డో, 1.9 కోట్ల విలువైన మెర్సిడెస్ బెంజ్ S, 1.15 కోట్ల విలువైన BMW 649d, 90 లక్షల విలువైన పోర్షే కేమాన్ 718 ఉన్నాయి. వీటిలో రూ.3 కోట్ల విలువైన లాంబోర్గినీ ఉరుస్, రూ. 1.23 కోట్ల విలువైన ఆడి క్యూ8, రూ.60.35 లక్షల విలువైన జీప్ రాంగ్లర్ ఉన్నాయి. తన లైవ్ షోలకు కోటి రూపాయలకు పైగా వసూలు చేస్తాడు. అతని సంపాదనలో ఎక్కువ భాగం బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, మూవీస్ నుంచి వస్తుంది. భారతీయ బీర్ బ్రాండ్‌లో వాటాదారు కూడా. ఢిల్లీ, చండీగఢ్, ముంబై, పూణె, లండన్, దుబాయ్ వంటి ప్రాంతాల్లో ఇళ్లు, ఆస్తులు కొనుగోలు చేశాడు. ఢిల్లీ, చండీగఢ్‌లలో రూ.12 కోట్ల విలువైన విలాసవంతమైన ఇల్లు, ముంబైలో రూ.5 కోట్ల ఆస్తిని కూడా కొనుగోలు చేశారు. మొత్తం సంపదను పరిశీలిస్తే, 2024 సంవత్సరంలో బాద్షా నికర విలువ దాదాపు రూ.124 కోట్లు.

View this post on Instagram

A post shared by BADSHAH (@badboyshah)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.