Tollywood: రూ.45 కోట్లతో నిర్మిస్తే రూ.45 వేలు కలెక్షన్స్ వచ్చాయి.. ఇండస్ట్రీలోనే భారీ అట్టర్ ప్లాప్ మూవీ ఏంటో తెలుసా..

పెట్టిన పెట్టుబడికి ఏమాత్రం సంబంధం లేకుండా అతి తక్కువ వసూళ్లు రాబట్టి నిర్మాతలకు నష్టాలు మూటగట్టింది. పెట్టిన బడ్జెట్ లో కేవలం 0.0001 శాతం మాత్రమే కలెక్షన్స్ రాబట్టి ప్రపంచంలోనే ఇంతకు మించిన ప్లాప్ మూవీ మరొకటి ఉండదేమో అన్నట్లుగా టాక్ తెచ్చుకుంది. రూ.45 కోట్లతో నిర్మించిన ఆ సినిమా కేవలం రూ.45 వేలు మాత్రమే వసూలు చేసింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా..?

Tollywood: రూ.45 కోట్లతో నిర్మిస్తే రూ.45 వేలు కలెక్షన్స్ వచ్చాయి.. ఇండస్ట్రీలోనే భారీ అట్టర్ ప్లాప్ మూవీ ఏంటో తెలుసా..
The Lady Killer
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 03, 2024 | 10:15 PM

రూ.45 కోట్లతో ఎంతో భారీగా నిర్మించి.. అట్టహాసంగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. కానీ ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది. పెట్టిన పెట్టుబడికి ఏమాత్రం సంబంధం లేకుండా అతి తక్కువ వసూళ్లు రాబట్టి నిర్మాతలకు నష్టాలు మూటగట్టింది. పెట్టిన బడ్జెట్ లో కేవలం 0.0001 శాతం మాత్రమే కలెక్షన్స్ రాబట్టి ప్రపంచంలోనే ఇంతకు మించిన ప్లాప్ మూవీ మరొకటి ఉండదేమో అన్నట్లుగా టాక్ తెచ్చుకుంది. రూ.45 కోట్లతో నిర్మించిన ఆ సినిమా కేవలం రూ.45 వేలు మాత్రమే వసూలు చేసింది. ఇంతకీ ఆ మూవీ ఏంటో తెలుసా..? అదే లేడీ కిల్లర్. ఇండియాలోనే అతి పెద్ద ప్లాప్ మూవీగా నిలిచింది. గతేడాది నవంబర్ 3న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యింది. ఎన్నో సంవత్సరాలు ఆలస్యం.. అన్ని లెక్కలు దాటేసిన బడ్జెట్.. చివరకు షూటింగ్ పూర్తికాకుండానే సినిమా రిలీజ్ చేయడంతో డిజాస్టర్లకే డిజాస్టర్ గా మారింది.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాత బోనీకపూర్ తనయుడు అర్జున్ కపూర్ హీరోగా ఇప్పటికీ సరైన్ బ్రేక్ అందుకోలేకపోయాడు. అర్జున్ కపూర్ సినిమాల కంటే మలైకా అరోరాతో ఉన్న రిలేషన్ షిప్ కారణంగానే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఇక ఈ హీరో కెరీర్‍లో అత్యంత భారీ డిజాస్టర్ లేడీ కిల్లర్. ఈ సినిమాను రూ.45 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. కానీ నవంబర్ 3, 2023న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 45 వేల రూపాయలు మాత్రమే రాబట్టింది. అందుకే ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్లాప్ మూవీగా నిలించింది. ఇందులో అర్జున్ కపూర్ సరసన భూమి ఫడ్నెకర్ కథానాయికగా నటించింది. ఈ చిత్రానికి అజయ్ బహ్ల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఇప్పుడు యూట్యూబ్‌లో ఉచితంగా విడుదల చేశారు.

అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఓటీటీలోకి రావాల్సింది. ఈ మూవీకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు కూడా జరిగాయట. కానీ సినిమా రిజల్ట్ చూశాక నెట్ ఫ్లిక్ తో డీల్ కుదరలేదని.. అందుకే ఈ సినిమాను ఇప్పుడు యూట్యూబ్ లో రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ చిత్రాన్ని యూట్యూబ్ లో ఫ్రీగా చూడొచ్చు అని చెప్పినప్పటికీ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ఈ సినిమా దేశవ్యాప్తంగా 12 షోలు మాత్రమే ఆడాయి. తొలి రోజు రూ.38 వేలు రాగా.. ఆ తర్వాత రోజులలో మొత్తం కలిపి రూ.45 వేలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?