Goat Movie: విడుదలకు ముందే రికార్డ్స్ బద్దలుకొట్టిన ‘ది గోట్’.. దళపతి మేనియాకు బాక్సాఫీస్ షేక్..

ఓవైపు హీరో విజయ్ తన రాజకీయ పార్టీ పనుల్లో బిజీగా ఉండడం.. మరోవైపు మూవీ టీం కూడా అంతగా ప్రచార కార్యక్రమాలపై పెద్ద దృష్టి సారించలేదు. కానీ విడుదలకు రెండు రోజుల ముందే బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ ప్రభంజనం సృష్టిస్తోంది ఈ చిత్రం. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం దళపతి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Goat Movie: విడుదలకు ముందే రికార్డ్స్ బద్దలుకొట్టిన 'ది గోట్'.. దళపతి మేనియాకు బాక్సాఫీస్ షేక్..
The Goat Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 04, 2024 | 8:02 AM

సౌత్ ఇండస్ట్రీలో ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ది గోట్ ఒకటి. కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి నటించిన ఈ సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. ది గోట్ మూవీ సెప్టెంబర్ 5న విడుదలకానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభంకాగా.. బాక్సాఫీస్ వద్ద రికార్డులు బద్దలుకొడుతుంది. అయితే ఈ సినిమాకు అంతగా ప్రమోషన్స్ కూడా చేయలేదు చిత్రయూనిట్. ఓవైపు హీరో విజయ్ తన రాజకీయ పార్టీ పనుల్లో బిజీగా ఉండడం.. మరోవైపు మూవీ టీం కూడా అంతగా ప్రచార కార్యక్రమాలపై పెద్ద దృష్టి సారించలేదు. కానీ విడుదలకు రెండు రోజుల ముందే బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ ప్రభంజనం సృష్టిస్తోంది ఈ చిత్రం. డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం దళపతి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు కలెక్షన్స్ పరంగా ఈ మూవీ లియో చిత్రాన్ని మించిపోతుందని అంచనా వేస్తున్నారు.

అయితే సెప్టెంబర్ 5న విడుదలైన కావాల్సిన ఈ సినిమా.. ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ పరంగా దూసుకుపోతుంది. బయటకు వస్తున్న అడ్వాన్స్ బుకింగ్ లెక్కల ప్రకారం ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు.ఈ సినిమా ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో రూ.12.82 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి.. కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 రికార్డ్ బ్రేక్ చేసింది. ఇండియన్ 2 సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కేవలం రూ.11.20 కోట్లు మాత్రమే రాబట్టింది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న లెక్కల ప్రకారం మొదటి రోజే గోట్ చిత్రం రూ.14 కోట్ల కంటే ఎక్కువగానే వసూలు చేసే అవకాశం ఉందట. ఇందులో రూ.11 కోట్లకు పైగా టిక్కెట్లు తమిళ ఏరియా నుంచి మాత్రమే కొనుగోలు చేయగా, రూ.208కి టిక్కెట్లు విక్రయిస్తుండగా, తెలుగు రాష్ట్రాల్లో రూ.7 లక్షల టిక్కెట్లు వచ్చాయి. GOAT IMAX ద్వారా రూ. 2 లక్షలకు పైగా సంపాదించింది. అంతర్జాతీయ మార్కెట్ విషయానికొస్తే ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా 16 కోట్ల రూపాయలకు పైగా రాబట్టింది. ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ రెండు భాషల్లోనూ విడుదల కానుంది. సెప్టెంబర్ 3 సాయంత్రం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ది గోట్ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, మాళవిక శర్మ హీరోయిన్లుగా నటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.