Kangana Ranaut: ఎట్టిపరిస్థితుల్లో నా సినిమా రిలీజ్ చేస్తా.. తగ్గేదే లే అంటోన్న కంగనా

సిక్కు మతానికి చెందిన కొందరు వ్యక్తులు ఎమర్జెన్సీ ప్రదర్శనను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. దాంతో సినిమా విడుదల వాయిదా పడింది. సినిమాలో సిక్కు మతాన్ని చెడుగా చిత్రీకరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటిస్తుంది.

Kangana Ranaut: ఎట్టిపరిస్థితుల్లో నా సినిమా రిలీజ్ చేస్తా.. తగ్గేదే లే అంటోన్న కంగనా
Kangana
Follow us

|

Updated on: Sep 04, 2024 | 7:40 AM

కంగనా రనౌత్ దర్శకత్వం వహిస్తూ.. నటించిన సినిమా ఎమర్జెన్సీ. ఈ మూవీ విడుదలపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. ఎమర్జెన్సీ సినిమాకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడంతో విడుదల ఆలస్యం అవుతోంది. సిక్కు మతానికి చెందిన కొందరు వ్యక్తులు ఎమర్జెన్సీ ప్రదర్శనను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఫిర్యాదు చేశారు. దాంతో సినిమా విడుదల వాయిదా పడింది. సినిమాలో సిక్కు మతాన్ని చెడుగా చిత్రీకరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సినిమాలో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటిస్తుంది. అయితే కంగనా, చిత్రబృందం ప్రస్తుతం ఉన్న అడ్డంకులను తొలగించి వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

తాజాగా కంగనా టీమ్ స్పందిస్తూ.. పది రోజుల తర్వాత సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలిపింది. సెన్సార్ సమస్యలు, కంగనాకు చంపేస్తామని బెదిరింపుల కారణంగా సినిమా విడుదల ఆలస్యమవుతోందని, ఇకపై ఎలాంటి ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా సినిమాను విడుదల చేయాలని చూస్తున్నట్టు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సినిమా అన్ ఎడిటెడ్ వెర్షన్ విడుదల కానుందని కంగనా తెలిపింది.

“ఎమర్జెన్సీ అనే నా సినిమాపై ఎమర్జెన్సీ విధించారు. ఇది భయంకరమైన పరిస్థితి. ఇక్కడ పరిస్థితులు ఎలా జరుగుతున్నాయి అని నేను చాలా నిరాశకు గురయ్యాను అని కంగనా అన్నారు. దేశంలో ఎమర్జెన్సీని తెరపైకి తెచ్చిన మొదటి సినిమా ఎమర్జెన్సీ కాదని కంగనా పేర్కొంది. గతంలో మధుర్ భండార్కర్ ఇందు సర్కార్, మేఘనా గుల్జార్ నటించిన సామ్ బహదూర్ చిత్రాలు ఒకే ఇతివృత్తంతో రూపొందాయని కంగనా తెలిపింది. ఈ చిత్రం మొదట అనౌన్స్ చేసిన తర్వాత దానికి వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తులు దాఖలు చేసిన పిటిషన్‌తో తన సినిమాకు సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్‌ను రద్దు చేయడాన్ని కూడా కంగనా ప్రశ్నించారు. శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ గతంలో ఈ సినిమా కంటెంట్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. ‘ఎమర్జెన్సీ’ని సిక్కు వ్యతిరేక చిత్రంగా వారు అభివర్ణించారు. సిక్కు కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న కమిటీ ప్రెసిడెంట్ హర్జిందర్ సింగ్ ధామి, ఆగస్టు 21న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ లో కంగనా ఉద్దేశపూర్వకంగా సిక్కుల మనోభావాలను దెబ్బతీసేలా పోస్ట్ లు చేస్తున్నారని అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి