Bigg Boss 8 : హౌస్‌లో పెద్దమనిషిగా మారిన నిఖిల్.. గట్టిగా ఇచ్చిపడేసిన కిరాక్ సీత

ఈసారి హౌస్ లోకి వెళ్లిన వాళ్లు చాలా మంది ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని క్యాండెట్సే.. ఎవరో ఒకరు ఇద్దరు మాత్రమే తెలిసిన మొఖాలు కనిపిస్తున్నాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ లో గట్టిగానే రచ్చ జరిగింది. బిగ్ బాస్ సీజన్ 8లో ఈసారి కెప్టెన్ లేడు అని నాగార్జున ముందే చెప్పారు. కానీ ఆ ప్లేస్ లో హౌస్ చీఫ్ పేరుతో ముగ్గురిని నియమించారు.

Bigg Boss 8 : హౌస్‌లో పెద్దమనిషిగా మారిన నిఖిల్.. గట్టిగా ఇచ్చిపడేసిన కిరాక్ సీత
Bigg Boss 8
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 04, 2024 | 7:27 AM

బిగ్ బాస్ సీజన్ 8 లో మొదటి రోజు నుంచే గొడవలు గోలలు మొదలయ్యాయి. ఈసారి హౌస్ లోకి వెళ్లిన వాళ్లు చాలా మంది ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని క్యాండెట్సే.. ఎవరో ఒకరు ఇద్దరు మాత్రమే తెలిసిన మొఖాలు కనిపిస్తున్నాయి. ఇక నిన్నటి ఎపిసోడ్ లో గట్టిగానే రచ్చ జరిగింది. బిగ్ బాస్ సీజన్ 8లో ఈసారి కెప్టెన్ లేడు అని నాగార్జున ముందే చెప్పారు. కానీ ఆ ప్లేస్ లో హౌస్ చీఫ్ పేరుతో ముగ్గురిని నియమించారు. నిఖిల్, నైనికా, యాష్మి ముగ్గురు హౌస్ చీఫ్ లు గా ఉన్నారు. వీరిలో నిఖిల్ బిగ్ బాస్ హౌస్ కెప్టెన్ లా ప్రవర్తిస్తున్నాడు.

పెద్దరికం తీసుకుంటూ.. ప్రతిదానికి డిస్కషన్ పెడుతున్నాడు. చూసే ప్రేక్షకులకు చిరాకు పుట్టించాడు. ఈ క్రమంలోనే మణికంఠ పై డైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చాడు. నేను చూసే వ్యూలోకి అందరూ రావాలి అంటున్న మణికంఠ నీకు నీకు వీకెండ్‌లో గట్టి గడ్డపార దింపుతా అని అనేశాడు.

మరోపక్క కిరాక్ సీత కూడా నిఖిల్ పై ఫైర్ అయ్యింది. కిరాక్ సీత, నిఖిల్ మధ్య హీట్ డిస్కషన్ నడిచింది. నిఖిల్ చెప్పిందే చెప్తుంటే సీతకు మండింది. హౌస్‌లో ఎవర్నీ మాట్లాడనీయవా? ఎన్నిసార్లు చెప్తావ్.? అంటూ బ్లాస్ట్ అయ్యింది. నేను ఆన్సర్ చెప్పకుండా వేరే ప్రశ్న వేయొద్దు అంటూ సీతతో వాదనకు దిగాడు నిఖిల్. నిఖిల్ సోదీ భరించలేకపోయిన పృథ్వీ కూడా ఆపవయ్యా బాబు ఎంతసేపు అదే మ్యాటర్ మాట్లాడావ్  అని అన్నాడు. దానికి నిఖిల్ కు ఇంకా మండింది. అది నా ఇష్టం అంటూ కెప్టెన్ లా బిహేవ్ చేశాడు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో నిఖిల్ కంటెంట్ ఇవ్వడానికి ప్రేక్షకుల దృష్టిలో పడటానికి గట్టిగానే ప్రయతించాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి