Tollywood: ఇద్దరు అన్నదమ్ములు సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తోన్న సూపర్ స్టార్స్.. ఫాలోయింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..

టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోస్ చైల్డ్ హుడ్ పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు సూపర్ స్టార్స్ చిన్ననాటి ఫోటో ఒకటి నెట్టింట సందడి చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. అమాయకంగా కనిపిస్తోన్న ఆ ఇద్దరు అన్నదమ్ముళ్లు.. ఇప్పుడు సౌత్ ఇండియాలో స్టార్ హీరోస్. తెలుగు, తమిళంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలు.

Tollywood: ఇద్దరు అన్నదమ్ములు సౌత్ ఇండస్ట్రీని ఏలేస్తోన్న సూపర్ స్టార్స్.. ఫాలోయింగ్ చూస్తే దిమ్మతిరిగిపోద్ది..
Actors..
Follow us

|

Updated on: Aug 28, 2024 | 1:08 PM

సెలబ్రెటీస్ గురించి తెలుసుకోవడానికి జనాలు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. ఇక తమ అభిమాన హీరోహీరోయిన్స్ పర్సనల్ విషయాలు, మూవీ విశేషాల పై ఇంట్రెస్ట్ ఎక్కువే. కొన్నాళ్లుగా సోషల్ మీడియా అభిమానులకు, సినీతారలకు మధ్య వారధిగా మారింది. ఇప్పుడు తమకు ఇష్టమైన తారలను ఫాలోకావడం.. వారి గురించి తెలుసుకోవడమే కాదు.. నేరుగా హీరోహీరోయిన్లను అడిగేస్తున్నారు. ఇక ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు స్టార్స్ కూడా సమాధానాలు ఇస్తు్న్నారు. కొన్నిరోజులుగా నెట్టింట త్రోబ్యాక్ ట్రెండ్ పేరుతో సినీరంగంలోని నటీనటులు చిన్ననాటి ఫోటోస్ షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోస్ చైల్డ్ హుడ్ పిక్స్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో ఇద్దరు సూపర్ స్టార్స్ చిన్ననాటి ఫోటో ఒకటి నెట్టింట సందడి చేస్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. అమాయకంగా కనిపిస్తోన్న ఆ ఇద్దరు అన్నదమ్ముళ్లు.. ఇప్పుడు సౌత్ ఇండియాలో స్టార్ హీరోస్. తెలుగు, తమిళంలో అత్యధిక ఫాలోయింగ్ ఉన్న హీరోలు. ముఖ్యంగా యూత్‏లో వీరికి చాలా క్రేజ్. ఇద్దరూ ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుని తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకుల మనసులలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నారు.

వీరిద్దరు తమిళ్ హీరోస్. అయినా.. తెలుగులో మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ సోదరుల సినిమాలు తెలుగులో రిలీజ్ చేస్తే సూపర్ హిట్ అవుతాయి. ఇంతకీ గుర్తుపట్టారా..? ఆ ఇద్దరే కోలీవుడ్ స్టార్ హీరోస్ సూర్య, కార్తీ. ఇద్దరు కోలీవుడ్ ఇండస్ట్రీ హీరోస్. కానీ టాలీవుడ్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న తారలు. విభిన్నమైన సినిమాలు.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అభిమానులను సొంతం చేసుకున్నారు. జాతీయ స్థాయిలో గుర్తింపు అందుకున్నారు. గజిని, సింహం చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు సూర్య. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో సినిమాలు చేసేందుకు రెడీ అయ్యారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం కంగువ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. త్వరలోనే ఈ మూవీ అడియన్స్ ముందుకు రానుంది. అలాగే కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సూర్య 44 చిత్రంలో నటిస్తున్నారు. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో సూర్య గ్యాంగ్ లీడర్ గా కనిపించనున్నారు. ఇక కార్తీ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మెయియజగన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో అరవింద్ స్వామి, రాజ్ కిరణ్, శ్రీదివ్యలు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నారు. ఇండస్ట్రీలోకి తన అన్నయ్య అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా సూర్యతో కలిసి ఉన్న ఫోటోను కొన్నాళ్ల క్రితం కార్తీ ఇన్ స్టాలో షేర్ చేయగా.. ఇప్పుడు వైరల్ గా మారింది. సూర్య ఇప్పటివరకు 40కి పైగా సినిమాల్లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు.

కార్తీ ఇన్ స్టా పోస్ట్.. 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.