Yukti Thareja : హీరోయిన్‏గా కలిసిరాని అదృష్టం.. నెట్టింట సెగలు పుట్టిస్తోన్న గ్లామర్ బ్యూటీ..

తెలుగులో మొదటి సినిమాతో అందం, అభినయంతో అలరించిన యుక్తికి అంతగా ఆఫర్స్ రావడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న యుక్తి.. నిత్యం లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థాయి అందుకు గుర్తింపు రావడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Yukti Thareja : హీరోయిన్‏గా కలిసిరాని అదృష్టం.. నెట్టింట సెగలు పుట్టిస్తోన్న గ్లామర్ బ్యూటీ..
Yukthi Thareja
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 25, 2024 | 1:45 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో గ్లామర్ ఫోజులతో మతిపోగొట్టేస్తోన్న హీరోయిన్ యుక్తి తరేజా. 2019లోనే మోడలింగ్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. ఎంటీవీ సూపర్ మోడల్ ఆఫ్ ది ఇయర్‏లో నాల్గవ స్థానంలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది. ఎన్నో కమర్షియల్ యాడ్స్ చేసిన ఈ అమ్మడికి తెలుగులో హీరో నాగశౌర్య సరసన ఛాన్స్ వచ్చింది. మొదటి సినిమాతోనే తెలుగు కుర్రాళ్ల ఫేవరేట్ అవుతుందనుకున్న ఈ ముద్దుగుమ్మకు అదృష్టం అంతగా కలిసిరాలేదు. నాగశౌర్య నటించిన రంగబలి సినిమాతో కథానాయికగా వెండితెరకు పరిచయమైంది యుక్తి తరేజా. కానీ మూవీ బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేదు. దీంతో ఇటు యుక్తికి కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్స్ రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలను షేర్ చేస్తూ ఆఫర్స్ కోసం ట్రై చేస్తుంది.

నెట్టింట గ్లామర్ ఫోటోలకు ఫోజులిస్తూ మైండ్ బ్లాంక్ చేస్తోంది ఈ బ్యూటీ. హర్యానా సమీపంలోని కైతల్ ప్రాంతంలో పర్వీన్ తరేజా, రీటా తరేజా దంపతులకు 2000వ సంవత్సరంలో జన్మించింది యుక్తి తరేజా. నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టిన యుక్తి.. మొదటిసారిగా ఇమ్రాన్ హష్మి చేసిన లూట్ గయే మ్యూజిక్ ఆల్బంలో కనిపించింది. కానీ ఆ పాటలో ఆమెకు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉండడం వల్ల అంతగా క్లిక్ కాలేదు. ఈ సాంగ్ తర్వాత యుక్తికి పలు ఆఫర్స్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

అలాగే తెలుగులో మొదటి సినిమాతో అందం, అభినయంతో అలరించిన యుక్తికి అంతగా ఆఫర్స్ రావడం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న యుక్తి.. నిత్యం లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ స్థాయి అందుకు గుర్తింపు రావడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. డైరెక్టర్ పవన్ బసంశెట్టి దర్శకత్వం వహించిన రంగబలి చిత్రంలో అలరించింది యుక్తి తరేజా.

View this post on Instagram

A post shared by Yukti Thareja (@realyukti)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.