Amrutha Movie: అమృతా మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..? ఆ చిన్నారి ఇప్పుడు అక్కినేని వారింటి కోడలు..

అమృతా మూవీ చైల్డ్ ఆర్టిస్టు అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల్లో అమృతా ఒకటి. 2002లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా ఉత్తమ తమిళ చిత్రం

Amrutha Movie: అమృతా మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..? ఆ చిన్నారి ఇప్పుడు అక్కినేని వారింటి కోడలు..
Amrutha Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 19, 2024 | 9:50 AM

సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. పలు సూపర్ హిట్ చిత్రాల్లో కొందరు బాలనటీనటులు తమ అద్భుతమైన నటనతో అడియన్స్ హృదయాల్లో చెరగని స్థానం సంపాదిచుకుంటారు. అందులో కొందరు ఇప్పుడు హీరోహీరోయిన్లుగా ఇండస్ట్రీన ఏలేస్తున్నారు. మరికొందరు మాత్రం సినిమాలకు దూరంగా ఉండిపోయారు. అలాంటివారిలో కీర్తన ఒకరు. సాధారణంగా ఈ పేరు సినీ ప్రియులకు అంతగా తెలియదు. కానీ అమృతా మూవీ చైల్డ్ ఆర్టిస్టు అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన సూపర్ హిట్ చిత్రాల్లో అమృతా ఒకటి. 2002లో విడుదలైన ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అంతేకాకుండా ఉత్తమ తమిళ చిత్రం, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్, ఉత్తమ సంగీత దర్శకుడు, సాహిత్యం, ఆడియోగ్రఫీ, ఎడిటింగ్ కేటగిరీలలో అవార్డులను అందుకుంది. అంతేకాకుండా అంతర్జాతీయ అవార్డ్స్, ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందకుంది బేబి పీఎస్ కీర్తన. ఆ చిన్నారి మరెవరో కాదు.. కోలీవుడ్ నటుడు కమ్ డైరెక్టర్ పార్తీబన్, నటి సీతల కుమార్తె.

తల్లిదండ్రులు ఇద్దరు నటీనటులు కావడంతో చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టింది. డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన అమృతా సినిమాలో సిమ్రాన్, మాధవన్ ఇద్దరూ హీరోహీరోయిన్స్. అయినప్పటికీ కథ మొత్తం కీర్తన చుట్టూనే తిరుగుతుంది. ఈ మూవీని తన సొంత తల్లిదండ్రులను కలుసుకోవాలనే ఓ చిన్నారి పడే ఆరాటం, పోరాటం ఆధారంగా తెరకెక్కించారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో కీర్తన యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు. అల్లరి పిల్లగా అలరించింది. అలాగే భావోద్వేగ సన్నివేశాల్లో తన నటనతో ప్రేక్షకులను కన్నీరు పెట్టించింది. మొదటి సినిమాతోనే చైల్డ్ ఆర్టిస్టుగా ఎన్నో అవార్డ్స్ అందుకుంది. అయితే ఈ సినిమా తర్వాత తల్లిదండ్రుల మాదిరిగానే సినీరంగంలో బిజీ నటిగా మారుతుందని అనుకున్నారు. కానీ అమృతా సినిమా తర్వాత మరో మూవీలో నటించలేదు.

Keerthana

Keerthana

చదువుల దృష్ట్యా సినిమాలకు దూరంగా ఉండిపోయింది. కీర్తనకు వివాహం జరిగింది. ఆమె అత్తారిల్లు అక్కినేని ఫ్యామిలీ ఫిల్మీ బ్యాగ్రౌండ్ చాలా పెద్దది. కీర్తన భర్త పేరు అక్షయ్. ఇండస్ట్రీలో ఫేమస్ డైరెక్టర్. కీర్తన అక్కినేని వారింటి పెద్ద కోడలు. కానీ నాగేశ్వరరావు, నాగార్జున అక్కినేని ఫ్యామిలీ కాదు. కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ ఎడిటర్ ఏ శ్రీకర్ ప్రసాద్ అక్కినేని. శ్రీకర్ తండ్రి అక్కినేని సంజీవి తెలుగులో అనేక సినిమాలను నిర్మించారు. అంతేకాదు ఎల్వీప్రసాద్ కు సంజీవి సోదరుడు. ఇక కీర్తన భర్త అక్షయ్ హిందీలో పలు చిత్రాలను తెరకెక్కించారు. ప్రస్తుతం కీర్తన పూర్తిగా ఫ్యామిలీని చూసుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
అన్నా క్యాంటీన్ వద్ద అదో మత్తైన వాసన.. ఏంటా అని చెక్ చేయగా..
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్‌ ఇంటర్వ్యూ తేదీలు వెల్లడి.. వివరాలివే
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ముచ్చటగా మూడోసారి.. ఎంసీజీలో చరిత్ర సృష్టించనున్న కేఎల్ రాహుల్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
ఆ ముగ్గురు హీరోలతో సినిమాలు చేయాలనుకున్నా.. డైరెక్టర్ శంకర్
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు.. ఆధునిక టౌన్‌ ప్లానింగ్‌లో..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్.. షన్ను ఎమోషనల్ కామెంట్స్..
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
మరోసారి తగ్గిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
రైల్వేలో 1036 పోస్టులకు మరో నోటిఫికేషన్‌.. ఈ అర్హతలుంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
సుప్రీం కోర్టులో 241 ఉద్యోగాలు.. డిగ్రీతోపాటు టైపింగ్‌ ఉంటే చాలు
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..
Horoscope Today: వారికి ఖర్చులు పెరిగే అవకాశం..