Shilpa Shetty: డబ్బు కోసమే రాజ్ కుంద్రాను సాగరకన్య పెళ్లి చేసుకుందా..? ధనవంతులు క్యూ కట్టినా వదిలేసిందట..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరోయిన్ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. రాజ్ కుంద్రా బ్రిటీష్ భారతీయులలో 108వ ధనవంతుడు. అలాగే సినిమాల్లో నటిస్తున్నప్పుడు తను కూడా ధనవంతురాలినని.. అలాగే ఇప్పుడు కూడా రిచ్ అని.. కేవలం డబ్బు కోసమే తను రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకోలేదని తెలిపింది.

బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టికి తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. విక్టరీ వెంకటేశ్ నటించిన సాహసవీరుడు సాగరకన్య సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. కానీ ఆ తర్వాత ఎక్కువగా నటించలేదు. అయితే ఇటీవల కొన్ని రోజులు ఏదోక కారణంతో శిల్పాశెట్టి నిత్యం వార్తలలో నిలుస్తుంది. పర్సనల్ లైఫ్, ఫిట్నెస్, సినిమాల గురించి ఇలా అనేక విషయాలతో వార్తలలో శిల్పా పేరు వినిపిస్తుంది. ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా అసభ్యకర సినిమా ప్రొడక్షన్ కేసులో అరెస్టయ్యాక, శిల్పా గురించి చాలా చర్చలు మొదలయ్యాయి. డబ్బు కోసమే రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకుందని పలువురు నటిని ట్రోల్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ హీరోయిన్ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. రాజ్ కుంద్రా బ్రిటీష్ భారతీయులలో 108వ ధనవంతుడు. అలాగే సినిమాల్లో నటిస్తున్నప్పుడు తను కూడా ధనవంతురాలినని.. అలాగే ఇప్పుడు కూడా రిచ్ అని.. కేవలం డబ్బు కోసమే తను రాజ్ కుంద్రాను పెళ్లి చేసుకోలేదని తెలిపింది.
‘ఒక విజయవంతమైన స్త్రీ తన నిబంధనల ప్రకారం జీవితాన్ని గడపడానికి సహాయపడే వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. అందుకే రాజ్‌ని పెళ్లి చేసుకున్నాను. భాగస్వామిలో నేను కోరుకున్న లక్షణాలన్నీ రాజ్‌లో ఉన్నాయి. రాజ్‌తో పెళ్లికి ముందు నాకు ధనవంతులు క్యూ కట్టారు. కానీ జీవితంలో ఆర్థిక విషయాలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇవ్వలేదు. జీవితంలో అన్నీ డబ్బుకు సంబంధించినవే కాదు.’ అని శిల్పాశెట్టి అన్నారు. శిల్పా తన అభిమానులకు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను ఎప్పుడూ చెబుతుంది.
శిల్పా-రాజ్ లవ్ స్టోరీ సినిమా కథ కంటే తక్కువ కాదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నా ఇద్దరూ వదలలేదు. శిల్పా రాజ్ దంపతులకు ఇద్దరు పిల్లలు. అతని పేరు వియాన్ 2020లో జన్మించాడు. తరువాత సరోగసి ద్వారా అమ్మాయికి జన్మనిచ్చింది. శిల్ప కూతురు పేరు సమీష. శిల్పా ఎప్పుడూ తన పిల్లలతో ఉన్న ఫోటోలు లేదా వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ప్రస్తుతం ‘కెడి’ సినిమాలో ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




