AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aamir Khan: బాక్సాఫీస్ షేక్ అయ్యే కాంబినేషన్.. ఆ దక్షిణాది స్టార్ డైరెక్టర్ తో ఆమిర్ ఖాన్ సినిమా

ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలు దక్షిణాది స్టార్ డైరెక్టర్లతో చేతులు కలుపుతున్నారు. ఇండస్ట్రీ హిట్స్ కొడుతున్నారు. అట్లీతో షారుఖ్ ఖాన్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా యానిమల్ తో రణ్ బీర్ కపూర్ మరో ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. అలాగే సల్మాన్ ఖాన్ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ వంతు వచ్చింది.

Aamir Khan: బాక్సాఫీస్ షేక్ అయ్యే కాంబినేషన్.. ఆ దక్షిణాది స్టార్ డైరెక్టర్ తో ఆమిర్ ఖాన్ సినిమా
Aamir Khan
Basha Shek
|

Updated on: Aug 19, 2024 | 9:32 AM

Share

ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలు దక్షిణాది స్టార్ డైరెక్టర్లతో చేతులు కలుపుతున్నారు. ఇండస్ట్రీ హిట్స్ కొడుతున్నారు. అట్లీతో షారుఖ్ ఖాన్ సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అలాగే సందీప్ రెడ్డి వంగా యానిమల్ తో రణ్ బీర్ కపూర్ మరో ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. అలాగే సల్మాన్ ఖాన్ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు అమీర్ ఖాన్ వంతు వచ్చింది. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో బాలీవుడ్ మిస్టర్ పర్‌పెక్షనిస్ట్ చేతులు కలుపుతున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించనుందని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో సినిమాలతో స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు లోకేష్ కనగరాజ్. ఇప్పుడు తన తర్వాతి ప్రాజెక్టు కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో భాగంగా పాన్ ఇండియా సినిమా చేసేందుకు లోకేశ్ రెడీ అవుతున్నాడని సమాచారం. ఇందులో బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ కథానాయకుడిగా నటించనున్నాడని సమాచారం. 2018 నుంచి అమీర్‌ఖాన్‌కు పెద్దగా విజయాలు లేవు. విడుదలైన ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’, ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలు ఘోర పరాజయం పాలయ్యాయి. దీంతో ఆయనకు ఇప్పుడు ఒక భారీ హిట్ అవవసరం. ఈ కారణంగానే ఆయన లోకేష్ కనగరాజ్‌తో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారని టాక్.

అమీర్ ఖాన్ ప్రస్తుతం ‘సితారే జమీన్ పర్’ చిత్రంలో నటిస్తున్నారు. 2018లో వచ్చిన స్పానిష్ సినిమా ‘ఛాంపియన్స్’కి ఇది రీమేక్. ఈ ఏడాది చివర్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరోవైపు లోకేష్ ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక మైత్రి మూవీ మేకర్స్ చేతిలో కూడా భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అల్లు అర్జున్ ‘పుష్ప 2’, జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ల సినిమా, రామ్ చరణ్, ప్రభాస్, హను రాఘవపూడి సినిమాలు, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ లతో ఒక సినిమా ఉన్నాయి. అలాగే అజిత్ కుమార్, సన్నీ డియోల్ తో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆమిర్ ఖాన్- లోకేశ్ సినిమాను కూడా భుజాలకెత్తుకున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్