Samantha: సమంత సంచలన నిర్ణయం! ఇకపై తెలుగు సినిమాల్లో కనిపించదా?

టాలీవుడ్ బ్యూటీ క్వీన్‌ సమంత ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. శాకుంతలం, ఖుషి తర్వాత కూడా తెలుగు వెండితెరపై కనిపించలేదు సామ్. అయితే ఆ మధ్యన తన పుట్టిన రోజున నిర్మాతగా ఒక సినిమాను అనౌన్స్ చేసిందీ అందాల తార. ప్రస్తుతం ఆమె దృష్టంతా బాలీవుడ్ వెబ్ సిరీస్ 'సిటాడెల్: హనీ బానీ' పైనే ఉంది

Samantha: సమంత సంచలన నిర్ణయం! ఇకపై తెలుగు సినిమాల్లో కనిపించదా?
Samantha
Follow us
Basha Shek

|

Updated on: Aug 19, 2024 | 9:05 AM

టాలీవుడ్ బ్యూటీ క్వీన్‌ సమంత ప్రస్తుతం సినిమాలేవీ చేయట్లేదు. శాకుంతలం, ఖుషి తర్వాత కూడా తెలుగు వెండితెరపై కనిపించలేదు సామ్. అయితే ఆ మధ్యన తన పుట్టిన రోజున నిర్మాతగా ఒక సినిమాను అనౌన్స్ చేసిందీ అందాల తార. ప్రస్తుతం ఆమె దృష్టంతా బాలీవుడ్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బానీ’ పైనే ఉంది. రాజ్, డీకే తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ లో సమంతకు జోడీగా బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో వరుణ్ ధావన్ నటించాడు. ఎప్పటి నుంచో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ క్రేజీ వెబ్ సిరీస్ నవంబర్ 7న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. కాగా ఇది సమంతకు ఇది రెండో వెబ్ సిరీస్. గతంలో ఇదే కాంబినేషన్ లో తెరకెక్కిన ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లోనూ ఒక కీలక పాత్ర పోషించిందీ అందాల తార. దీని తర్వాత బాలీవుడ్ లో మరో క్రేజీ ప్రాజెక్టుకు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రాజ్ అండ్ డీకే నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతోన్న రక్త్ బ్రహ్మండ్ లో సమంత కీలక పాత్ర పోషించనుందని టాక్. ఇందులో ఆదిత్య రాయ్ కపూర్, వామికా గబ్బి కూడా యాక్ట్ చేశారు. ఈ చిత్రానికి రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహించారు. నెట్‌ఫ్లిక్స్ భాగస్వామ్యంతో రాజ్, డీకే ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, సమంత ప్రస్తుతం తన దృష్టిని బాలీవుడ్ పైనే కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. తెలుగు సినిమాలను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. పాన్-ఇండియన్ సినిమాల కోసం టాలీవుడ్ నుంచి ఆమెకు అనేక ఆఫర్లు వస్తున్నాయని అయితే సామ్ మాత్రం హిందీ ఇండస్ట్రీ పైనే పూర్తిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. చాలా మంది తెలుగు నిర్మాతలు క్రేజీ ఆఫర్లు ఇస్తున్నప్పటికీ హిందీ తో పాటు పాన్-ఇండియన్ ప్రాజెక్ట్‌లపైనే ఆమె ఎక్కువ దృష్టి పెట్టింది. ది ఫ్యామిలీ మ్యాన్: సీజన్ 2 ఘన విజయం సాధించడం ఆమె నిర్ణయానికి కారణం కావచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ముంబైలో నే ఎక్కువగా ఉంటుంది సామ్. అసలు హైదరాబాద్ లో కనిపించడం లేదు. దీనికి తోడు ఇటీవల నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్‌ జరగడంతో ఇక కొన్నాళ్లు ముంబైలో ఉండిపోవాలని ఈ అందాల తార డిసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

సిటా డెల్ వెబ్ సిరీస్  ప్రమోషన్లలో సమంత, వరుణ్ ధావన్.. వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.