- Telugu News Photo Gallery Cinema photos Tollywood Choreographer Jani Master Felicitation Ceremony Photos Goes Viral
Jani Master: జాతీయ అవార్డు సాధించిన జానీ మాస్టర్‌కు ఘన సన్మానం.. ఫొటోస్ ఇదిగో
ఇటీవల కేంద ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డ్ దక్కించుకున్నాడు టాలీవుడ్ కు చెందిన జానీ మాస్టర్. తిరుచిత్రాంబలం (తెలుగులో తిరు) సినిమాలోని మేఘం కరుగత ( తెలుగులో మేఘం కరిగెనే) పాటకు గానూ సతీష్ కృష్ణన్ తో కలిసి బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడీ స్టార్ కొరియోగ్రాఫర్.
Updated on: Aug 19, 2024 | 8:34 AM

ఇటీవల కేంద ప్రభుత్వం ప్రకటించిన 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డ్ దక్కించుకున్నాడు టాలీవుడ్ కు చెందిన జానీ మాస్టర్. తిరుచిత్రాంబలం (తెలుగులో తిరు) సినిమాలోని మేఘం కరుగత ( తెలుగులో మేఘం కరిగెనే) పాటకు గానూ సతీష్ కృష్ణన్ తో కలిసి బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డ్ సొంతం చేసుకున్నాడీ స్టార్ కొరియోగ్రాఫర్.

ఈ మేరకు ఆదివారం (ఆగస్టు 18) హైదరాబాద్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖుల సమక్షంలో జానీ మాస్టర్‌కు ఘనంగా సన్మానం చేశారు.

డ్యాన్సర్స్ అసోసియేషన్ నాయకులు, తెలుగు ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ వల్లభనేని, ఫిలింఛాంబర్ ప్రెసిడెంట్ భరత్ భూషణ్, నిర్మాతలు ప్రసన్నకుమార్, దామోదర ప్రసాద్, శేఖర్ మాస్టర్ తదితర సినీ ప్రముఖులు ఈ సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా తనను సత్కరించేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు జానీ మాస్టర్ . అలాగే గణేష్, శేఖర్ మాస్టర్ లతో ఉన్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నాడీ కొరియో గ్రాఫర్.

ప్రస్తుతం జానీ మాస్టర్ సన్మాన కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు జానీకి అభినందనలు తెలుపుతున్నారు.

అంతకుముందు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జానీ మాస్టర్ ను అభినందిస్తూ ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. సినిమా రంగానికి ఆయన అందించిన సేవలను కొనియాడారు.