- Telugu News Photo Gallery Cinema photos Jahnvi Kapoor Sister Khushi Kapoor reacts On Her Nose and Lip Surgery Comments
Khushi Kapoor: అవును.. ఆ పార్ట్‌కు సర్జరీ చేయించుకున్నాను.. జాన్వీ చెల్లెలిపై నెటిజన్స్ ప్రశంసలు..
ప్రముఖ దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పై కొందరు నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. చిన్నవయసులో అమ్మతో కలిసి ఖుషీ కపూర్ ఓ సినిమాకు వేడుకకు హాజరయ్యారు. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఖుషీ కపూర్ ఫోటోస్ గమనిస్తూ
Updated on: Aug 19, 2024 | 11:50 AM

ప్రముఖ దివంగత నటి శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఈ బ్యూటీ పై కొందరు నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు.

చిన్నవయసులో అమ్మతో కలిసి ఖుషీ కపూర్ ఓ సినిమాకు వేడుకకు హాజరయ్యారు. అలాగే ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఖుషీ కపూర్ ఫోటోస్ గమనిస్తూ కొందరు నెటిజన్స్ ఆమె ముఖంలో ఏదో మార్పు ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం ప్రారంభించారు.

తన ఫోటోస్, లుక్స్ గురించి వస్తున్న కామెంట్స్ గమనించిన ఖుషీ కపూర్.. తాను కాస్మోటిక్ సర్జరీ చేయించుకున్నానని.. ముక్కు ఆకారం మారిందనీ తెలిపింది. దీంతో ఆమె నిజాయితీని కొందరు నెటిజన్స్ అభిమానందిస్తున్నారు.

చాలా మంది హీరోయిన్స్ ఇలా సర్జరీలు చేయించుకుంటారు.. కానీ బయటకు చెప్పరని.. అలాగే ఒప్పుకోరు కూడా.. కానీ ఖుషీ మాత్రం ధైర్యంగా చెప్పిందని.. ఆమె నిజాయితీని మెచ్చుకోవాలని రియాక్ట్ అవుతున్నారు.

ప్రస్తుతం ఖుషీ కపూర్ తమిళ్ హిట్ మూవీ లవ్ టూడే హిందీ రీమేక్ తో ఖుషీ కపూర్ బిజీగా ఉంది. ఈ మూవీలో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు.




