Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? స్టార్ హీరోలకు బొమ్మ చూపిస్తోన్న హీరోయిన్.. క్రేజ్‌లో నెక్ట్స్ లెవెల్ అంతే

పై ఫొటోలో చిరునవ్వులు చిందిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడీ అమ్మాయి క్రేజీ హీరోయిన్. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే అతి తక్కువ కాలంలోనే తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు స్టార్ హీరోలకు మించిన క్రేజ్ ఈ ముద్దుగుమ్మ సొంతం. ఇటీవల ఈ అమ్మడు నటించిన ఒక లేడీ ఓరియంటెండ్ మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరస్తోంది.

Actress: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? స్టార్ హీరోలకు బొమ్మ చూపిస్తోన్న హీరోయిన్.. క్రేజ్‌లో నెక్ట్స్ లెవెల్ అంతే
Actress Childhood Photo
Follow us
Basha Shek

|

Updated on: Aug 18, 2024 | 1:34 PM

పై ఫొటోలో చిరునవ్వులు చిందిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడీ అమ్మాయి క్రేజీ హీరోయిన్. తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే అతి తక్కువ కాలంలోనే తన అందం, అభినయంతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు స్టార్ హీరోలకు మించిన క్రేజ్ ఈ ముద్దుగుమ్మ సొంతం. ఇటీవల ఈ అమ్మడు నటించిన ఒక లేడీ ఓరియంటెండ్ మూవీ ఇండస్ట్రీ రికార్డులను తిరగరస్తోంది. స్టార్ హీరోల సినిమాలకు సాధ్యం కానీ కలెక్షన్లు ఈ బ్యూటీ మూవీకి వస్తున్నాయి. దీంతో ఒక్కసారిగా ఈ హీరోయిన్ ట్రెండింగ్ లోకి వచ్చింది. అన్నట్లు ఈ సొగసరి మన తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. గతంలో పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తో కలిసి ఒక సూపర్ హిట్ సినిమాలో నటించి మెప్పించింది. మరి గత కొన్ని నెలులుగా విజయం కోసం ముఖం వాచిపోయేలా ఎదురు చూస్తోన్న బాలీవుడ్ ఇండస్ట్రీకి ఊపిరిపోసిన ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు ‘స్త్రీ 2’ సినిమా హీరోయిన్ శ్రద్ధా కపూర్. ఇది ఆమె చిన్ననాటి ఫొటో. ‘స్త్రీ 2’ కలెక్షన్ల ప్రభంజనం నేపథ్యంలో ప్రస్తుతం శ్రద్ధాకు సంబంధించిన ఏ విషయమైనా ఇట్టే వైరల్ అయిపోతుంది. పై ఫొటో కూడా ఆ కోవకు చెందినదే.

స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా బాలీవుడ్‌లో మూడు సినిమాలు విడుదలయ్యాయి. అక్షయ్ కుమార్ నటించిన ‘ఖేల్ ఖేల్ మే’ తో పాటు జాన్ అబ్రహం నటించిన ‘వేద’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాలతో పాటు చిన్న సినిమాగా తెరకెక్కిన ‘స్త్రీ 2’ థియేటర్లలోకి అడుగు పెట్టింది.

ఇవి కూడా చదవండి

 వరుణ్ ధావన్ తో శ్రద్ధా కపూర్..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Maddock Films (@maddockfilms) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

కానీ ఇప్పుడీ చిన్న సినిమానే టాప్ హీరోల సినిమాలకు షాక్ ఇస్తోంది. మూడు రోజుల్లోనే ఈ సినిమాకు రూ. 135 కోట్ల వసూళ్లు రావడం విశేషం. ‘స్త్రీ 2’ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు. శ్రద్ధా కపూర్ తో పాటు రాజ్‌కుమార్ రావ్, అభిషేక్ బెనర్జీ, పంకజ్ త్రిపాఠి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. అలాగే తమన్నా భాటియా, వరుణ్ ధావన్ క్యామియో రోల్స్ లో కనిపించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.