- Telugu News Photo Gallery Cinema photos Anchor Sreemukhi shares her latest photos on the occasion of Varalakshmi Vratham
Sreemukhi: వరలక్ష్మి వ్రతం స్పెషల్.. లంగా ఓణీలో మెరిసిన శ్రీముఖి.. బుల్లితెర రాములమ్మ ఎంత అందంగా ఉందో చూశారా?
తన మాటల సవ్వడితో తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా బోలెడు క్రేజ్ తెచ్చుకుంది శ్రీముఖి. ఓవైపు టీవీ షోలు చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార. ఇక సోషల్ మీడియాలోనూ శ్రీముఖికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
Updated on: Aug 17, 2024 | 7:55 PM

తన మాటల సవ్వడితో తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా బోలెడు క్రేజ్ తెచ్చుకుంది శ్రీముఖి. ఓవైపు టీవీ షోలు చేస్తూనే.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటోందీ అందాల తార. ఇక సోషల్ మీడియాలోనూ శ్రీముఖికి భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ఓవైపు టీవీషోలు, సినిమాలు చేస్తోన్న శ్రీముఖి సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది.

తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను కూడా సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులు, నెటిజన్లతో తరచూ షేర్ చేసుకుంటుందీ బుల్లితెర రాములమ్మ.

తాజాగా వరలక్ష్మి వ్రతాన్ని పురస్కరించుని లంగా ఓణీలో ముస్తాబైంది శ్రీముఖి. గ్రీన్ లెహంగా, రెడ్ కలర్ ఓణి ధరించి ఎంతో అందంగా కనిపించింది.

డ్రస్ కు తగ్గట్టుగా మ్యాచింగ్ జ్యువెలరీ, గాజులు, మెడకి, చెవులకు రింగ్స్.. ముఖానికి కుంకుమ బొట్టు పెట్టుకుని ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది

ప్రస్తుతం శ్రీముఖి షేర్ చేసిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. 'వావ్.. సూపర్' అంటూ అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు