- Telugu News Photo Gallery Cinema photos Heroine Kangana Ranaut's Emergency Movie Trailer Review in Telugu Telugu Actress Photos
Kangana Ranaut: మరో కాంట్రవర్సీకి రెడీ అయిన క్వీన్.! కంగనా ఎమర్జెన్సీ..
నేను కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాను.. వాటివాల్లే నా కెరీర్ ఇలా మారిపోయిందంటూ ఆ మధ్య స్టేట్‌మెంట్ ఇచ్చారు కంగన రనౌత్. కానీ ఆ కాంట్రవర్సీలే లేకపోతే అసలు కంగనకు కెరీరే లేదనేవాళ్ళున్నారు. కొన్నాళ్లుగా ఆమె మార్క్ సినిమాలు మిస్ అవుతున్నారు ఫ్యాన్స్. అలాంటి వాళ్ల కోసమే మళ్లీ వచ్చేసారు ఎంపీగారు. మరి కంగన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి.? బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు కంగనా రనౌత్.
Updated on: Aug 17, 2024 | 10:00 PM

నేను కాంట్రవర్సీలకు దూరంగా ఉంటాను.. వాటివాల్లే నా కెరీర్ ఇలా మారిపోయిందంటూ ఆ మధ్య స్టేట్‌మెంట్ ఇచ్చారు కంగన రనౌత్. కానీ ఆ కాంట్రవర్సీలే లేకపోతే అసలు కంగనకు కెరీరే లేదనేవాళ్ళున్నారు.

కొన్నాళ్లుగా ఆమె మార్క్ సినిమాలు మిస్ అవుతున్నారు ఫ్యాన్స్. అలాంటి వాళ్ల కోసమే మళ్లీ వచ్చేసారు ఎంపీగారు. మరి కంగన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి..?

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అనగానే ముందుగా గుర్తుకొచ్చే పేరు కంగనా రనౌత్. ఒకప్పుడు వరసగా విజయాలతో పాటు నేషనల్ అవార్డులు కూడా సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. కొన్నాళ్లుగా ఫామ్‌లో లేరు.

కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. పర్సనల్‌గా మాత్రం సక్సెస్ అయ్యారు. రాజకీయాల్లోకి వెళ్లి ఎంపి కూడా అయ్యారీమె. ప్రస్తుతం ఎమర్జెన్సీ సినిమాతో వచ్చేస్తున్నారు. నిజానికి ఎమర్జెన్సీ సినిమా ప్రకటించినప్పటి నుంచే కంగనకు కష్టాలు తప్పట్లేదు.

ఈ కేసులో తదుపరి విచారణ సెప్టెంబర్ 30న జరగనుంది. ఆ రోజే ఎమర్జెన్సీ విడుదలపై క్లారిటీ రానుంది. మొదట్నుంచే ఎమర్జెన్సీపై వివాదాలున్నాయి.

సినిమాలో ఉన్న కొన్ని అభ్యంతరకర సీన్స్ తొలగిస్తే గానీ.. సర్టిఫికెట్ ఇవ్వలేమని కోర్టుకు వివరించింది సెన్సార్ బోర్డు. దీనిపై సెప్టెంబర్ 30 లోపు నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలను కోర్టు ఆదేశించింది.

కంగన సినిమాపై కోర్ట్‌కు సెన్సార్ బోర్ట్ ఏం చెప్పింది..? దానికి నిర్మాతలు ఇచ్చిన రిప్లై ఏంటి..? ఎమర్జెన్సీ సెన్సార్ విషయమై బాంబే హై కోర్టులో విచారణ జరిగింది.




