మేడమ్ మీరేనా.. గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ.. షాకవుతున్న ఫ్యాన్స్..

Rajitha Chanti

Pic credit - Instagram

21 March 2026

ప్రస్తుతం బుల్లితెరపై సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది భావన లాస్య. మల్లి సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది ఈ అమ్మడు.

ఆ తర్వాత లక్ష్మీ నివాసం సీరియల్లో నటిస్తుంది. టీవీ ప్రపంచంలో పద్దతిగా చీరకట్టులో కనిపించే ఈ అమ్మడు నెట్టింట మాత్రం అరాచకం సృష్టిస్తుంది. 

ఎప్పుడూ చీరకట్టులో ముద్దుగా ఉండే లాస్య.. ఇప్పుడు సోషళ్ మీడియాలో గ్లామర్ రచ్చ చేస్తుంది. పద్దతిగా కనిపిస్తూనే క్రేజీ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది.

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. బ్లూ లెహంగాలో మరింత వయ్యారంగా ఫోజులిచ్చింది ఈ బ్యూటీ.

నటనపై ఆసక్తితో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. అయితే అంతకు ముందు ఈ ముద్దుగుమ్మకు అనుకోకుండానే సీరియల్ ఛాన్స్ వచ్చిందని తెలిపింది. 

భావన లాస్య అచ్చమైన తెలుగమ్మాయి. బెంగాల్ లో పుట్టినా వైజాగ్ లో పెరిగింది. ఆమె తండ్రి రైల్వే ఉద్యోగి. కెనడాలో ఎంబీఏ పూర్తి చేయాలని కలలు కంది. 

కానీ అనుకోకుండా సీరియల్ ఛాన్స్ వచ్చింది. సోషల్ మీడియాలో ఆమెను చూసి ఓ ప్రొడ్యూసర్ కాల్ చేశారని.. అలా సీరియల్లో నటించే ఛాన్స్ వచ్చిందని తెలిపింది.

మల్లీ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం బుల్లితెరపై తనదైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఈ అమ్మడు.