AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harish Shankar: నటుడిగా మిస్టర్ బచ్చన్ డైరెక్టర్ హరీశ్ శంకర్.. ఏయే సినిమాల్లో యాక్ట్ చేశారో తెలుసా?

పై ఫొటోలో అమాయకంగా కనిపిస్తోన్నదెవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్. కెరీర్ లో ఎక్కువగా రీమేకులే చేసినా.. ఒరిజినల్ కన్నా అద్బుతంగా తీయగలడనే ప్రశంసలు అందుకున్న ట్యాలెంటెడ్ దర్శకుడు. ఇటీవలే మాస్ మహారాజా రవితేజ- భాగ్యశ్రీ భోర్సే హీరో హీరోయిన్లుగా మిస్టర్ బచ్చన్ అనే మూవీని తెరకెక్కించాడు హరీష్ శంకర్

Harish Shankar: నటుడిగా మిస్టర్ బచ్చన్ డైరెక్టర్ హరీశ్ శంకర్.. ఏయే సినిమాల్లో యాక్ట్ చేశారో తెలుసా?
Harish Shankar
Basha Shek
|

Updated on: Aug 17, 2024 | 9:55 PM

Share

పై ఫొటోలో అమాయకంగా కనిపిస్తోన్నదెవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు సెన్సేషనల్ డైరెక్టర్ హరీష్ శంకర్. కెరీర్ లో ఎక్కువగా రీమేకులే చేసినా.. ఒరిజినల్ కన్నా అద్బుతంగా తీయగలడనే ప్రశంసలు అందుకున్న ట్యాలెంటెడ్ దర్శకుడు. ఇటీవలే మాస్ మహారాజా రవితేజ- భాగ్యశ్రీ భోర్సే హీరో హీరోయిన్లుగా మిస్టర్ బచ్చన్ అనే మూవీని తెరకెక్కించాడు హరీష్ శంకర్. ఇది కూడా రైడ్ కు రీమేక్ అయినా తెలుగు ప్రేక్షకులకు అనుగుణంగా ఎన్నో మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించాడు. ఆగస్టు 15న రిలీజైన మిస్టర్ బచ్చన్ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. దీంతో హరీశ్ శంకర్ ఖాతాలో మరో హిట్ పడినట్లయింది. అయితే హరీశ్ మంచి డైరెక్టరే కాదు ఆయనలో చాలా మంచి నటుడు ఉన్నాడు. తరుణ్, అనిత, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా వచ్చిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో చాలా సీన్లలో కనిపిస్తాడీ స్టార్ డైరెక్టర్. 2003లో వచ్చిన ఈ చిత్రానికి కొండ దర్శకత్వం వహిస్తే.. హరీష్ శంకర్ అసోసియేట్ దర్శకుడిగా పని చేశాడు. అలాగే ఇదే సినిమాలో కొన్ని సీన్లలో తళుక్కున మెరిశారు. ఇదే కాదు అందరివాడు, ఏ ఫిల్మ్ బై అరవింద్, మొదటి సినిమా, నేనింతే, సమ్మోహనం చిత్రాల్లో కూడా స్పెషల్ రోల్స్ లో కనిపించాడు హరీశ్ శంకర్.

నటుడిగా యాక్ట్ చేస్తూనే.. పలు సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాడు హరీశ్ శంకర్. నిన్నే ఇష్టపడ్డాను, వీడే, మొదటి సినిమాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే రవితేజతో కలిసి ‘షాక్’ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అయితే ఇందులో హరీశ్ శంకర్ టేకింగ్, డైరెక్షన్ కు ఫిదా అయిన రవితేజ మిరపకాయ్ సినిమాతో మళ్లీ ఛాన్స్ ఇచ్చాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి గబ్బర్ సింగ్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. సాయి ధరమ్ తేజ్ సుబ్రమణ్యం ఫర్ సేల్, అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం, వరుణ్ తేజ్ తో గద్దల కొండ గణేష్ చిత్రాలు తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేరిపోయాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ తీస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్..

డైరెక్టర్ హరీశ్ శంకర్ ,పవన్ కల్యాణ్ లతో శ్రీలీల..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.