Y Vijaya: సీనియర్ నటి వై విజయ కూతురిని చూశారా? అందంలో అమ్మను మించి.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్

తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన అలనాటి నటీమణుల్లో వై విజయ ఒకరు. సుమారు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న ఆమె వెయ్యికి పైగా సినిమాల్లో నటించింది. తన అందం, అభినంయతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. కెరీర్ ప్రారంభంలోనే ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర్‌రావు, శోభన్ బాబు వంటి అగ్రహీరోల పక్కన నటించిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు.

Y Vijaya: సీనియర్ నటి వై విజయ కూతురిని చూశారా? అందంలో అమ్మను మించి.. లేటెస్ట్ ఫొటోస్ వైరల్
Y Vijaya Family
Follow us
Basha Shek

|

Updated on: Aug 16, 2024 | 3:58 PM

తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన అలనాటి నటీమణుల్లో వై విజయ ఒకరు. సుమారు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్న ఆమె వెయ్యికి పైగా సినిమాల్లో నటించింది. తన అందం, అభినంయతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. కెరీర్ ప్రారంభంలోనే ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర్‌రావు, శోభన్ బాబు వంటి అగ్రహీరోల పక్కన నటించిన ఆమె ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిపోయారు. సిల్వర్ స్క్రీన్ పై విజయను చూడగానే చాలా మంది ‘ పులుసు’ అంటూ కేకలు వేసేవారు అప్పటి ఆడియెన్స్. మంగమ్మగారి మనవడు, మా పల్లెలో గోపాలుడు, ముద్దుల క్రిష్ణయ్య సినిమాల్లో చేపల పులుసు చేయడంలో తనకు తానే సాటి అని చెప్పుకునే పాత్రలో కనిపించారామె. అప్పటి నుంచి వై విజయ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ‘పులుసు’ గానే నిలిచిపోయారు. తెలుగులోనే కాదు కన్నడ,మలయాళం,తమిళ్ భాషల్లో కూడా నటించి అక్కడి ప్రేక్షకులను అలరించారు వై విజయ. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి 80వ దశకంలో 1000 కి పైగా సినిమాలు నటించిన నటీమణుల్లో విజయ్ కూడా ఒకరు. కాగా ఆ మధ్యన సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు. సందీప్ కిషన్ తెనాలి రామకృష్ణ బిఏ.యల్.యల్.బి, వెంకటేశ్, వరుణ్ తేజ్ ఎఫ్-2, ఎఫ్-3 సినిమాల్లో కనిపించి నవ్వుల పువ్వులు పూయించారు. ప్రస్తుతం కొన్ని సీరియల్స్ లోనూ కనిపిస్తున్నారామె.

ఇవి కూడా చదవండి

సినిమాల సంగతి పక్కన పెడితే వై. విజయ 1985 లో అమలనాథన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.ఈ దంపతులకు అనుష్క అనే ఒక కూతురు ఉంది. అయితే ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. 2013లోనే అనుష్క వివాహం చెన్నైలో ఘనంగా జరిగింది. వెడ్డింగ్ రిసెప్షన్ కు సినిమా ప్రముఖులందరూ విచ్చేశారు. రాధిక, బాలచందర్, సుహాసిని, శ్రీ ప్రియ, శారద, రమా ప్రభ తదితరులు విజయ కూతురి పెళ్లి వేడుకలో తళుక్కుమన్నారు. కాగా విజయ కూతురు చూడడానికి అచ్చం వాళ్లమ్మలాగానే ఉంటుంది. ఇటీవల వీరిద్దరు కలిసున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. వీటిని చూసి సినీ అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వై. విజయకు ఇంత పెద్ద కూతురు ఉందా? అని నోరెళ్ల బెడుతున్నారు.

కూతురితో వై విజయ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.