రాష్ట్రపతి భవన్లో జరిగిన కీర్తి చక్ర ప్రదానోత్సవంలో వీరమరణం పొందిన సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్ తల్లి భావోద్వేగానికి లోనయ్యారు. ప్రోటోకాల్ పక్కనబెట్టి, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Murmu) ఆమెను హృదయానికి హత్తుకుని ఓదార్చారు. ఇద్దరు కుమారులను కోల్పోయిన రాష్ట్రపతి, మరో తల్లి బాధను అర్థం చేసుకుని పంచుకున్నారు. ఇది మానవత్వం చాటిన గొప్ప క్షణం.